Latest Updates
-
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.! -
బ్లాక్ కాఫీ vs గ్రీన్ టీ.. బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కి ఈ రెండింటిలో ఏది బెస్ట్? -
బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే..
చాలామందికి పొద్దున్నే ఆఫీసులకు లేదా వర్క్ కి వెళ్లే హడావుడిలో బ్రేక్ ఫాస్ట్ చేసుకునే టైం లేక తినడం మానేస్తుంటారు. అలాంటప్పుడు బ్రెడ్ తో చేసే వంటకాలను కూడా చాలామంది వండుకుంటారు. బ్రెడ్ తో తక్కువ సమయంలో వెరైటీ రెసిపిలను ట్రై చేస్తుంటారు. అయితే ఎప్పుడూ అదే రొటీన్ బ్రెడ్ జామ్ లేదా నార్మల్ శాండ్ విచ్ తిని బోర్ కొట్టిందా? అయితే నోరూరించే మసాలా బ్రెడ్ టోస్ట్ ట్రై చేయాల్సిందే.
ఇది ఎంత రుచిగా ఉంటుందంటే.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, మధ్యాహ్నం లంచ్ బాక్స్ లోకి, రాత్రికి లైట్ డిన్నర్ లా లేదా సాయంత్రం టీ టైమ్ స్నాక్ గా.. ఇలా ఎప్పుడైనా సరే లాగించేయొచ్చు. వంట గదిలో ఉండే సాధారణ పదార్థాలతో కేవలం 10 నిమిషాల్లోనే దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్లు లేదా బ్యాచిలర్స్ కూడా దీన్ని ఇట్టే చేసేయొచ్చు.

మసాలా బ్రెడ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
బ్రెడ్ స్లైసెస్ - తగినన్ని
శనగపిండి - 3 టేబుల్ స్పూన్లు
పెరుగు - 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ - 1 పెద్దది
టమాటో - 1
జీలకర్ర పొడి - అర టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కారం - అర టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నూనె - అర టీస్పూన్
ఆవాలు - కొద్దిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
నీళ్లు - పిండి కలుపుకోవడానికి
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!
మసాలా బ్రెడ్ టోస్ట్ తయారీ విధానం
-మొదటగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అర టీస్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ గరం మసాలా, అర టీస్పూన్ కారం వేసి,3 టేబుల్ స్పూన్ల శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ కమ్మటి పెరుగు వేయండి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. బజ్జీల పిండిలా కొంచెం చిక్కగా ఉండేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు ఆ పిండి మిశ్రమంలో కొత్తిమీరను వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని, మనం ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచాలి. బ్రెడ్ రెండు వైపులా పిండి, ఉల్లిపాయ, టమాటో ముక్కలు బాగా అంటేలా కోట్ చేసుకోవాలి. బ్రెడ్ ను పిండిలో మరీ ఎక్కువసేపు ఉంచకూడదు, అలా చేస్తే మెత్తబడి విరిగిపోతుంది.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పైన ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టండి. అందులో అర టీస్పూన్ నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వండి. ఈ తాలింపు సువాసన వస్తుండగా.. ముందుగా పిండిలో ముంచి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ను నెమ్మదిగా పెనం మీద ఉంచండి. బ్రెడ్ కింది వైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చండి. ఆ తర్వాత రెండో వైపుకు తిప్పి దోరగా కాల్చుకోవాలి.
-అంతే మసాలా బ్రెడ్ టోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
