Latest Updates
-
ఈ వర్షాకాలంలో చూడాల్సిన 10 బెస్ట్ వాటర్ ఫాల్స్..ఒక్క రోజులో హైదరాబాద్ నుంచి వెళ్లి రావొచ్చు! -
రాత్రి అన్నం మిగిలిందా? పారేయకండి.. ఇలా కరకరలాడే కుర్కురేలు చేసుకోండి! -
భగవంతుడు విగ్రహ రూపంలోనే ఎందుకు పూజించబడుతున్నాడు? -
35 ఏళ్ల తర్వాత శృంగారంపై ఆసక్తి, స్టామినా తగ్గుతుందా? తిరిగి ఎనర్జీ పొందే సూపర్ టిప్స్! -
నిజం కన్నా ఈ 5 మాటలే మీ బంధాన్ని మరింత మధురంగా మారుస్తాయి! -
ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే స్వీట్ కార్న్ వడ.. రుచితో పాటు ఇమ్యూనిటీ కూడా! -
అక్కడ అడ్మిషన్ దొరికితే లైఫ్ సెటిల్ అయినట్టే.. ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్ స్కూల్స్ ఇవే.. -
ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం నిల్వ..దేంతో తిన్నా అదిరిపోయే మహారాష్ట్ర స్పెషల్ వెల్లుల్లి కారం! -
తల నుంచి కాలి వరకు..శరీరంలో ప్రతి భాగాన్ని హెల్తీగా ఉంచే హెల్తీ ఫుడ్స్ -
ఈ ఆదివారం ఈ 5 రాశుల వారికి కాసుల వర్షం.. అదృష్టం మీ వెంటే!
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే టమాటా బిర్యానీ..ఎలా చేసుకోవాలో చూడండి
వెరైటీ రైస్ అనగానే చాలాంందికి ఫస్ట్ గుర్తొచ్చేది టమాటో రైస్. పిల్లల లంచ్ బాక్స్‌లకైనా, ఆఫీస్ క్యారేజీలకైనా, ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుండి రాత్రి భోజనం వరకు రోజులో ఏ సమయంలోనైనా ఇట్టే సరిపోయే అద్భుతమైన వంటకం ఇది. టమాటో రైస్ ను అందరూ అంతగా ఇష్టపడటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే ఇది అచ్చం బిర్యానీ రుచిని తలపిస్తుంది.
టమాటో రైస్ ను ఎప్పుడూ చేసే రొటీన్ పద్ధతిలో కాకుండా, కాస్త కొత్తగా, మరింత రుచిగా, అసలు సిసలైన బిర్యానీని మరిపించేలా ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? సాధారణ బిర్యానీ కన్నా మరింత కమ్మగా ఉండే టమాటో బిర్యానీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

టమాటో బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
యాలకులు - 4
సోంపు - 1 టేబుల్ స్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
పెద్ద టమాటాలు - 4
కశ్మీరీ కారం - 1 టేబుల్ స్పూన్
కారం - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, పుదీనా - పావు కప్పు చొప్పున
చిక్కటి కొబ్బరి పాలు - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
టమాటో బిర్యానీ తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీటిని పూర్తిగా వడకట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో నూనె వేడి చేశాక దాల్చిన చెక్క, యాలకులు, సోంపు వేసి ఓ నిమిషం పాటు దోరగా వేయించండి. ఆ వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు మరో నిమిషం మగ్గనివ్వండి.
-ఇప్పుడు అందులోనే కారం, కశ్మీరీ కారం, గరం మసాలా, పసుపు వేసి బాగా కలపండి. రుచికి సరిపడా ఉప్పు, పంచదార వేయండి. మసాలాలు నూనెలో వేగగానే, సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసి కలపాలి. టమాటాలు మెత్తగా, గుజ్జులా మారే వరకు సుమారు 5 నిమిషాల పాటు ఉడికించండి.
-టమాటో గుజ్జు నుండి నూనె పైకి తేలుతున్న సమయంలో సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులు, కొబ్బరి పాలు 1 కప్పు, అలాగే 2 కప్పుల నీళ్లు పోయండి. ఆ తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అందులో వేసి సున్నితంగా కలపండి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. అంతే టమాటో బిర్యానీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications