Latest Updates
-
కీళ్ల నొప్పులు, జలుబును మాయం చేసే మునగాకు ఉలవల సూప్..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అందరూ ప్లేట్లు నాకేస్తారు.. బెండకాయ వంకాయ కాంబినేషన్ అదుర్స్! -
నల్ల దోసె.. చూస్తే షాక్, తింటే ఫిదా అవ్వాల్సిందే..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే దూదిలాంటి సగ్గుబియ్యం దోశ.. ఎలా చేయాలో తెలుసా? -
మీ నాలుక ఇలా ఉంటే మహారాజ యోగమే.. శాస్త్రం ఏం చెబుతోందంటే? -
మైదా బ్రెడ్ కు గుడ్ బై.. ఇంట్లోనే ఈజీగా రాగి బ్రెడ్ చేసుకోండిలా..ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచి! -
దంతాలు డైమండ్స్ లా మెరవాలా? తేనెతో ఇలా చేయండి.. -
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. నోరూరించే సొరకాయ పకోడీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
ఇంట్లోనే KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్..పైకి కరకర, లోపల జ్యూసీ..
ఆదివారం వచ్చిందంటే చాలు చాలామంది ఇళ్లల్లో మాంసాహారం ఉండాల్సిందే! అందులోనూ చికెన్ వంటకాలు ఉంటే ఆ మజాయే వేరు. అయితే ప్రతిసారీ ఒకే రకమైన చికెన్ కూర, ఎప్పటిలాగే ఆవిరి మీద ఉడికించడం, లేదా రొటీన్ ఫ్రైలు తిని బోర్ కొట్టిందా? అయితే పాప్ కార్న్ చికెన్ ట్రై చేయాల్సిందే.
పైకి కరకరలాడుతూ, లోపల జ్యూసీగా ఉండే ఈ ముక్కలను చూస్తే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా నోరూరాల్సిందే. ఎలాంటి రంగులు లేకుండా చాలా సులభంగా మన ఇంట్లోనే పాప్ కార్న్ చికెన్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

పాప్ కార్న్ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు
బోన్ లెస్ చికెన్ - అర కిలో
వెల్లుల్లి పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి - పావు టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్
గుడ్లు - 2
మైదా పిండి - 1 కప్పు
నూనె - వేయించడానికి సరిపడా
పాప్ కార్న్ చికెన్ తయారీ విధానం
-ముందుగా బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడగాలి. నీళ్లు లేకుండా చూసుకుని, ఆ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులో వెల్లుల్లి పొడి, మిరియాల పొడి, ఉప్పు, మరియు కారం పొడి వేసి ప్రతి ముక్కకు మసాలా బాగా పట్టేలా కలపండి. ఈ మసాలాలు మాంసంలోకి బాగా ఇంకిపోవడానికి కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి.
-చికెన్ నానే లోపు, మరో గిన్నెలో రెండు గుడ్లను పగలగొట్టి వేసి బాగా గిలకొట్టాలి. ఇంకొక వెడల్పాటి గిన్నెలో మైదా పిండిని పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పట్టించిన చికెన్, గిలకొట్టిన గుడ్డు, మైదా పిండి.. ఈ మూడింటినీ వరుసగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోండి.
-ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను తీసుకుని, ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచాలి. వెంటనే దానిని మైదా పిండిలో వేసి, పిండి ముక్కకు బాగా అంటుకునేలా దొర్లించాలి. వాటిని విడివిడిగా ఒక శుభ్రమైన ప్లేట్‌లో పెట్టుకోండి. KFC లాంటి ఎక్స్‌ట్రా క్రిస్పీనెస్ రావాలంటే, పిండిలో దొర్లించిన ముక్కలను మళ్లీ గుడ్డులో ముంచి, రెండోసారి కూడా మైదా పిండిలో దొర్లించండి. దీనినే డబుల్ కోటింగ్ అంటారు.
-స్టవ్ వెలిగించి, బాండీలో నూనె పోసి బాగా వేడి చేయండి. నూనె వేడెక్కాక, మంటను కాస్త తగ్గించి, కోట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను నూనెలో వేయండి. ఇవి లేత బంగారు గోధుమ రంగు లోకి మారి, కరకరలాడే వరకు సుమారు 3 నుండి 5 నిమిషాల పాటు బాగా వేయించండి.
-అంతే ఎంతో వేడివేడిగా, కరకరలాడే రుచికరమైన KFC స్టైల్ పాప్ కార్న్ చికెన్ రెడీ. టొమాటో కెచప్ తో దీనిని తింటుంటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications