Latest Updates
-
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.! -
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.!
స్పైసీ మసాలా కార్న్ కర్రీ..చపాతీ, నాన్ లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్!
వర్షాకాలంలో మొక్కజొన్నను నిప్పుల మీద కాల్చి, కాస్త ఉప్పు, కారం, నిమ్మరసం రాసుకుని తింటే ఆ మజాయే వేరు. కొందరు ఉడకబెట్టిన స్వీట్ కార్న్ ఇష్టపడితే, మరికొందరు సలాడ్స్ రూపంలో లాగించేస్తుంటారు. ఇవన్నీ రెగ్యులర్గా తినేవే. కానీ మీరు ఎప్పుడైనా కమ్మని వెన్న వాసనతో గుమగుమలాడే స్పైసీ మసాలా కార్న్ కర్రీని రుచి చూశారా? ఒక్కసారి ఈ కూరను చపాతీ లేదా అన్నంతో తిన్నారంటే, మళ్లీ మళ్లీ కావాలంటారు.

స్పైసీ కార్న్ కర్రీకి కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
అల్లం - 1 అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 5
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయ - 1
టమాటాలు - 2
జీడిపప్పు - 5-6
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
కసూరి మెంతి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వెన్న (బటర్) - 1 టీస్పూన్
వంట నూనె - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
చికెన్ 65, చిల్లీ చికెన్ మర్చిపోతారు.. ఈ కేరళ చికెన్ ఫ్రై రుచి చూస్తే!
స్పైసీ కార్న్ కర్రీ తయారీ విధానం
-ముందుగా జీడిపప్పులను కొద్దిసేపు నీళ్లలో నానబెట్టుకొని తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మొక్కజొన్న గింజలను తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోండి. గింజలు ఉడికిన తర్వాత నీటిని వడకట్టేయండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి, అందులో కాస్త వెన్న (బటర్) వేయండి. వెన్న కరిగాక ఉడికించిన మొక్కజొన్న గింజలను అందులో వేసి సన్నని మంట మీద దోరగా వేయించండి. వేయించిన ఈ గింజలను పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక అర టీస్పూన్ జీలకర్ర వేయండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించండి. వెల్లుల్లి ముక్కలు పచ్చివాసన పోయి, దోరగా వేగుతున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి లేత బంగారు రంగులోకి మారేలా మీడియం మంట మీద వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని (గుజ్జు) ఇందులో వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించండి
-ఇప్పుడు ఉడుకుతున్న టమాటా గ్రేవీలో పసుపు, కాశ్మీరీ కారం, రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మెంతి, కాస్త చాట్ మసాలా వేసి బాగా కలపండి.
-మసాలా పచ్చివాసన పోయాక, ముందుగా తయారుచేసుకున్న జీడిపప్పు పేస్ట్ ను వేయండి. దీనిని రెండు నిమిషాలు ఉడికించాక, బటర్ లో వేయించి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న గింజలను గ్రేవీలో వేసి బాగా కలిపి మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి.
-అంతే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరను పైన చల్లుకుంటే మసాలా కార్న్ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
