గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్‌లో ఉండాల్సిందే.!

పచ్చళ్లు అనగానే టమాటా, గోంగూర, ఉల్లిపాయ, దొండకాయ పచ్చళ్లు గుర్తొస్తాయి. కానీ వీటిని రొటీన్‌గా చేసుకుని తింటూ బోర్‌ కొట్టేసిందా.. అయితే ఈ సారి కొత్తగా క్యాప్సికమ్‌ పచ్చడి ట్రై చేసి చూడండి. ఈ చట్నీ టేస్ట్‌ పరంగానే కాదు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది. జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలున్న క్యాప్సికమ్‌తో కర్రీ ఇష్టపడని వారు ఇలా చట్నీ ట్రై చేయండి. వదలకుండా తింటారు.

Capsicum onion chutney for weight loss and heart health recipe in telugu

క్యాప్సికమ్‌ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- టేబుల్‌ స్పూన్‌
పచ్చి శనగపప్పు- టేబుల్‌ స్పూన్‌
మినప్పప్పు- టేబుల్‌ స్పూన్‌
వెల్లుల్లి- ఐదు రెబ్బలు
అల్లం- చిన్న ముక్క
ఉల్లిపాయలు- నాలుగు(మీడియం సైజు)
క్యాప్సికం- ఒకటి
పచ్చిమిర్చి- రెండు
చింతపండు- కొద్దిగా
ఉప్పు- టీస్పూన్‌
కొత్తిమీర- గుప్పెడు
తురిమిన పచ్చి కొబ్బరి- మూడు టేబుల్‌ స్పూన్లు

క్యాప్సికమ్‌ పచ్చడి తయారీ విధానం

ముందుగా స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో నూనె పోసి వేయడ్డాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసి పచ్చివాసన పోయేదాక వేయించాలి.

స్పెషల్‌ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్‌లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్‌ పులావ్‌.. ఇంటిల్లిపాదికీ పండగే.!

తర్వాత ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అందులో క్యాప్సికమ్‌ ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ నూనెలో బాగా మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కడిగిన కొత్తిమీర వేసి కలపాలి. చివరిగా పచ్చి కొబ్బరి మిశ్రమం వేసి కలుపుకోవాలి.

Capsicum onion chutney for weight loss and heart health recipe in telugu

ఇదంతా బాగా ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని ప్లేట్‌లో వేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్‌లో వేసి రుబ్బుకోవాలి. ఉప్పు సరిచూసుకుంటూ చట్నీని గ్రైండ్‌ చేసుకోవాలి.

ఈ చట్నీని వేరే బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకుని తాలింపు పెట్టుకోవడమే. టేస్టీ క్యాప్సికమ్‌ పచ్చడి రెడీ.

రెస్టారెంట్‌ స్టైల్‌ టేస్టీ స్టార్టర్‌.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్‌.. ఎలా చేయాలంటే.!

ఈ చట్నీని ఉదయం టిఫిన్స్‌లోకి ప్రిపేర్‌ చేసుకోవచ్చు. లేదా లంచ్‌లోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంగది. బరువు తగ్గాలనుకునేవారు డిన్నర్‌లో చపాతీల్లోకి తినడం మంచిది. క్యాప్సికమ్‌ కంటి ఆరోగ్యాన్ని సైతం కాపాడుతుంది. సీజనల్‌ టైంలో తప్పనిసరిగా క్యాప్సికమ్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

[ of 5 - Users]
Story first published: Saturday, August 29, 2026, 14:16 [IST]
Desktop Bottom Promotion