సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్‌ ఖాగినా’.. హైదరాబాద్‌ దాబా స్టైల్‌లో ఇలా చేసేయండి.!

ఎగ్‌ పొరుటు అంటే చాలా మందికి తెలిసిందే. వేడివేడిగా అన్నంలోకి ఈ కూరను ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా ఉల్లిపాయలు, గుడ్లు ఉంటే చాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ అదే ఎగ్‌ పొరుటును కొంచెం కొత్తగా లక్నోలో చేస్తారు. అదే ఎగ్‌ ఖాగినా. ఈ రెసిపీని సెలబ్రిటీల ఫేవరెట్‌. ప్రముఖులు చాలా ఇష్టంగా తినే ఈ రెసిపీని మన హైదరాబాద్‌ దాబా స్టైల్‌లో కూడా చేయొచ్చు. మరి ఈ ఫేమస్‌ ఎగ్‌ ఖాగినాను ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం..

Celebrities favourite recipe viral egg khagina recipe dhaba style easy process

హైదరాబాద్‌ దాబా స్టైల్‌ ఎగ్‌ ఖాగినా తయారీకి కావాల్సిన పదార్థాలు

నూనె- అర కప్పు
ఉల్లిపాయలు- అర కిలో
ఉప్పు- టీస్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- అర టేబుల్‌ స్పూన్‌
కారం- టేబుల్‌ స్పూన్‌
గరం మసాలా- టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
నీళ్లు- పావు కప్పు
గుడ్లు- ఐదు
పచ్చిమిర్చి- రెండు
కొత్తిమీర- అర కప్పు

హైదరాబాద్‌ దాబా స్టైల్‌ ఎగ్‌ ఖాగినా తయారీ విధానం

డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్‌ ఎగ్ రైస్‌.!

ముందుగా స్టవ్‌పైన మందపాటి పాన్‌ పెట్టుకుని వేడయ్యాక నూనె పోసుకుని కాగనివ్వాలి. కాగిన తర్వాత ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మరీ చిన్నగా కాకుండా, మరీ పెద్దగా కాకుండా మీడియం సైజ్‌లో కట్‌ చేసుకోవాలి. అలా అయితేనే తినేటప్పుడు పళ్లకి తగులుతూ వీటి ఫ్లేవర్‌ తెలుస్తుంది.

ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు టీస్పూన్‌ ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ దోరగా వేగాల్సిన అవసరం లేదు. ఉప్పు వేయడం ద్వారా త్వరగా రంగుమారుతాయి. లైట్‌ బ్రౌన్ కలర్‌లోకి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించుకోవాలి.

కారం, గరం మసాలా, పసుపు వేసి కలిపి కాసేపు ఉడికించుకోండి. తర్వాత పావు కప్పు నీళ్లు పోసి కలిపి కారం, మసాలాలు ఉడకనివ్వాలి.

Celebrities favourite recipe viral egg khagina recipe dhaba style easy process

గ్రేవీ చిక్కబడుతున్నప్పుడు గుడ్లను పాన్‌మొత్తం స్ప్రెడ్‌ అయ్యేలా తలా ఒక చోట పగలగొట్టుకోవాలి. గుడ్లను పగలకొట్టిన తర్వాత కలపకూడదు. మూత పెట్టి 12 నుంచి 15 నిమిషాల పాటు చిన్న మంటపైన ఉడకనివ్వాలి.

పావుగంట తర్వాత మూత తీసి గరిటెతో చిన్నగా నీలం పార్ట్‌ను కదపాలి. నీలం మొత్తం పాన్‌లో వ్యాపిస్తుంది. ఇప్పుడు మళ్లీ మూత పెట్టి మూడు నిమిషాల పాటు మీడియం మంటపైన ఉడికించాలి.

కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!

తర్వాత మూత తీసి మరోసారి గరిటెతో నెమ్మదిగా కూరను కదపాలి. ఇప్పుడు చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

మూత తీసి ఫైనల్‌గా గరిటెతో కూరను కలిపి ఉప్పు సరిచూసుకోవాలి. ఈ కర్రీలో కోడిగుడ్డు ముక్కలు చిన్నగా కాకుండా పెద్దగా ఉంటేనే రుచిగా ఉంటుంది. తినేటప్పుడు పచ్చిమిర్చి క్రిస్పీగా తగులుతుంది.

నీచు వాసన పోయి కూర మొత్తం ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. ఎగ్‌ ఖాగినా రెడీ. వేడిగా అన్నంలోకి లేదా చపాతీలోకి ఈ కర్రీని సెలబ్రిటీలు ఇష్టంగా తింటారు.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 23, 2026, 12:41 [IST]
Desktop Bottom Promotion