Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఇది రెగ్యులర్ ఉప్మా కానే కాదు.. చుక్క నూనె లేకుండా చల్లతో చేసే హెల్తీ ఉప్మా.!
ఉప్మా అంటే చాలా మంది ముఖం చాటేస్తారు. కానీ కొందరు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారు. అయితే వేడి మీద ఉన్నప్పుడే దాని రుచి అద్భుతంగా ఉంటుంది. చల్లారిందంటే ముఖం చిట్లిస్తారు. ఇదంతా పక్కన పెడితే మీరెప్పుడైనా జొన్న రవ్వతో ఉప్మా ట్రై చేశారా.? చుక్క నూనె లేకుండా మజ్జిగతో ఇలా హెల్తీగా ఉప్మా చేయండి. డైట్ పాటించేవారికి బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌లోకి ఈ హెల్తీ జొన్న రవ్వ ఉప్మా తప్పనిసరిగా టై చేయాల్సిందే..

చల్ల జొన్న రవ్వ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
జొన్న ఉప్మా రవ్వ- కప్పు
పుల్లటి పెరుగు- కప్పు
నీళ్లు- రెండు కప్పుల మీద పావు కప్పు
నెయ్యి- మూడు టేబుల్ స్పూన్లు
చల్ల మిరపకాయలు- మూడు
పోపు దినుసులు(ఆవాలు, జీలకర్ర, శనగపప్పు)- టీస్పూన్
మిరియాలు- అర టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు- ఐదు
పచ్చిమిర్చి- రెండు (చిన్నగా గుండ్రంగా తరిగినవి)
ఉల్లిపాయ- ఒకటి
కరివేపాకు- రెండు రెబ్బలు
ఉప్పు- రుచికి సరిపడా
చల్ల జొన్న రవ్వ ఉప్మా తయారీ విధానం
చల్ల జొన్న రవ్వ ఉప్మా కోసం ముందు కప్పు రవ్వను సిద్ధం చేసుకోవాలి.
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే!
ఇప్పుడు ఒక బౌల్లో పుల్లటి పెరుగును తీసుకుని బాగా చిలికించాలి. ఇందులో రెండు కప్పుల మీద మరో పావు కప్పు నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టాలి.
స్టవ్‌పైన ఉప్మా తయారీకి వెడల్పాటి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. కరిగిన తర్వాత అందులో చల్ల మిరపకాయలు వేసి వేగనివ్వాలి. తర్వాత పక్కన పెట్టుకోవాలి.

మిగిలిన నెయ్యిలో తాలింపు దినుసులు, మిరియాలు వేసి కలపాలి. ఇప్పుడు పొట్టు తీసి చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కలపాలి. కరివేపాకు వేసి వేయించాలి.
కేరళ స్టైల్ రొయ్యల వేపుడు.. మసాలా ఇలా దట్టించారంటే కారం నషాళానికి అంటాల్సిందే.!
చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో రుచికి సరపడా ఉప్పు వేసి కలపాలి.
ఇప్పుడు జొన్న రవ్వ ఉప్మా వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత మజ్జిగ పోసి పెద్ద మంట పైన ఉడకనివ్వాలి.
ఉప్మా దగ్గరికి అయ్యాక చిన్న మంటపైన ఉడకనివ్వాలి. చివరిగా చల్ల మిరపకాయలు స్మాష్ చేసి వేసుకోవాలి. పూర్తయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
ఈ ఉప్మాను వేడివేడిగా తింటేనే దాని రుచి అమోఘంగా ఉంటుంది. డయాబెటిస్, బీపీ బాధితులకు బ్రేక్‌ఫాస్ట్ లేదా డిన్నర్‌లోకి సరైన డైట్. వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్‌ను నియంత్రించవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బరువును అదుపులో ఉంచుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
