Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
చేతి చెక్కలు ఎప్పుడైనా తిన్నారా? వర్షం పడుతున్నప్పుడు తింటే కేకో కేక..కరకరలాడుతూ భలే రుచిగా..
తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి నోరూరించే పిండివంటలు. సాయంత్రం వేళ వర్షం పడుతున్నప్పుడు లేదా చల్లని వాతావరణంలో వేడి వేడి టీ లేదా కాఫీ తాగుతూ, కరకరలాడే సంప్రదాయ స్సాక్ చేతి చెక్కలను తింటుంటే వచ్చే ఆనందమే వేరు. కరకరలాడుతూ, చాలా రుచిగా ఉంటాయి. చేతి చెక్కలు కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఇందులో ఉపయోగించే దినుసుల వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. చేతి చెక్కలు తయారు చేయడానికి మన వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉండే సాధారణ దినుసులే సరిపోతాయి.

చేతి చెక్కల తయారీకి కావలసిన పదార్థాలు
-బియ్యం పిండి
-పచ్చి శనగపప్పు
-వెన్న
-పచ్చిమిర్చి
-అల్లం
-ఉల్లిపాయ
-కరివేపాకు
-కొత్తిమీర
-నూనె
-నీళ్లు
-ఉప్పు
-లవంగాలు
చేతి చెక్కల తయారీ విధానం
-ముందుగా అర కప్పు పచ్చి శెనగపప్పుని శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత 20 గ్రాముల అల్లం ముక్క, 10 పెద్ద పచ్చిమిరపకాయలను కట్ చేసి వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి, ఇందులో పావు టీస్పూన్ ఉప్పు వేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఒక గిన్నెలో 4 కప్పుల పొడి బియ్యం పిండి(500 గ్రా) వేయండి. ఈ పిండిలోనే 1 టీస్పూన్ ఉప్పు, 100 గ్రాముల వెన్న వేసి పిండికి బాగా పట్టించాలి. చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకున్నాక ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్, 5 రెమ్మల కరివేపాకు, గుప్పుడు కొత్తిమీర తరుగు, 10 కచ్చాపచ్చాగా దంచుకున్న లవంగ మొగ్గలు, గుప్పుడు ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పును నీళ్లు అన్నీ వంసేసి పిండిలో వేసుకొని మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోండి.
-ఇప్పుడు పిండి మిశ్రమంలోనే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, మరీ మెత్తగా కలుపుకోకూడదు.
-ఇప్పుడు ఒక ప్లేట్ కి వెనుక వైపు నూనె రాసి పెట్టుకోండి. కలిపిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పొడవుగా రోల్ చేసుకొని చేత్తోనే నొక్కినట్లు కొంచెం మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి. నాలుక ఆకారంలో ఉంటాయి. మొత్తం పిండితో ఇలా చేసుకొని ఆయిల్ రాసిన ప్లేట్ మీద ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ వేడి చేసి అందులో వీటిని వేసి మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకొని తీసేయాలి. అంతే చేతి చెక్కలు రెడీ.
ఆరోగ్య ప్రయోజనాలు
-చేతి చెక్కలలో ప్రధాన వనరు బియ్యం పిండి. బియ్యం పిండిలో కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తాయి.
-మనం ఇందులో నానబెట్టిన పచ్చి శనగపప్పు వాడతాము. ఈ పప్పు ధాన్యాలు మొక్కల ఆధారిత ప్రొటీన్ కు అద్భుతమైన మూలాలు. ఇవి కండరాల నిర్మాణానికి, కణాల మరమ్మత్తుకు సహాయపడతాయి.
-అల్లం, పచ్చిమిర్చి కేవలం కారానికి, రుచికి మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications