జలుబు, దగ్గుకి చెక్‌ పెట్టే చికెన్‌ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్‌ స్పైసీగా.!

వర్షాకాలంలో జలుబు, దగ్గు లాంటి సీజనల్‌, వైరల్‌ వ్యాధులు కామన్‌. ఇక చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఈ సమస్య ఎెక్కువగా ఉంటుంది. ఈ సమయంలో రిలీఫ్‌ పొందేందుకు వారు ఎక్కువగా స్పైసీ ఫుడ్స్‌ను ఇష్టపడతారు. అయితే ఈ వైరల్‌ వ్యాధులకి మిరియాలు దివ్య ఔషధం. పిల్లలు ఇష్టంగా తినే చికెన్‌లో ఈ మిరియాలు కలిపారంటే ఇక జలుబు, దగ్గు ఒక్క రోజులో మాయం కావాల్సిందే. సింపుల్‌గా అయిపోయే చికెన్‌ మిరియాల రసం ఎలా తయారు చేయాలో చూద్దాం..

chicken pepper rasam for immediate relief from cold and cough in monsoon

చికెన్‌ మిరియాల రసం తయారీకి కావాల్సిన పదార్థాలు

ముందుగా పౌడర్‌ కోసం సిద్ధం చేసుకోవాల్సినవి

ధనియాలు- రెండు టీస్పూన్లు
మిరియాలు- రెండు టేబుల్‌స్పూన్లు
జీలకర్ర- రెండు టీస్పూన్లు
కరివేపాకు- రెండు రెబ్బలు

బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ!

రసం కోసం

చికెన్‌- 600 గ్రాములు
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
జీలకర్ర- రెండు టీస్పూన్లు
వెల్లుల్లి- 15
పచ్చిమిర్చి- నాలుగు
ఎండుమిర్చి- మూడు
కరివేపాకు- రెండు రెబ్బలు
పసుపు- అరటీస్పూన్‌
ఉప్పు- రుచికి సరిపడా
గరం మసాలా- టేబుల్‌ స్పూన్‌
చింతపండు రసం- నిమ్మకాయ సైజు
టమాటాలు- నాలుగు
నీళ్లు- ఐదు కప్పులు
కొత్తిమీర- కొద్దిగా

చికెన్‌ మిరియాల రసం తయారీ విధానం

ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు వేసి వేయించుకుని చల్లారాక మిక్సీలో పౌడర్‌గా చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే కడాయిలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దోరగా అయ్యేవరకు వేయించాలి.

రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్‌ సైడ్‌ డిష్‌.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్‌ ఫ్రై

తర్వాత చికెన్‌ వేసి నీరు అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పౌడర్‌ వేసి కలపాలి.

chicken pepper rasam for immediate relief from cold and cough in monsoon

ఉడికిన తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా వేసి మరోసారి కలిపి మసాలాలు అన్నీ బాగా పట్టి మంచి సువాసన వచ్చేవరకు ఉడికించాలి.

తర్వాత టమాటా ముక్కలను ప్యూరీగా చేసి వేసుకోవాలి. కూరల టమాటాల రసం పచ్చివాసన పోయేవరకు ఉడికించిన తర్వాత చింతపండు రసం పోసి కలపాలి.

ఇప్పుడు నాలుగు లేదా ఐదు కప్పుల వరకు నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. రసం మీకు కావాల్సిన లెవెల్‌కు వచ్చేవరకు ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

కారం లేకుండానే మిరియాల ఘాటుతో స్పైసీ చికెన్‌ మిరియాల రసం రెడీ. వేడివేడిగా అన్నంలోకి ఈ కాంబినేషన్‌ ఎవర్‌ గ్రీన్‌ టేస్ట్‌. ఈ సీజన్‌లో వీకెండ్‌కి తప్పనిసరిగా ట్రై చేయాల్సిన స్పెషల్‌ డిష్‌.

[ of 5 - Users]
Story first published: Friday, August 7, 2026, 10:12 [IST]
Desktop Bottom Promotion