Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఒంట్లో వేడిని తగ్గించే, ఇమ్యూనిటీ పెంచే సూపర్ టేస్టీ చిన్న ఉల్లిపాయల సాంబార్..
దక్షిణ భారతదేశంలో సాంబార్ కు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. ఇడ్లీ, దోశ, వడ లేదా వేడి వేడి అన్నం.. ఇలా దేనిలోకైనా సాంబార్ పడాల్సిందే. సాంబార్ తయారీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ, చిన్న ఉల్లిపాయలతో (సాంబార్ ఉల్లిపాయలు) చేసే ఉల్లి సాంబార్ రుచి మాత్రం అమోఘం. చిన్న ఉల్లిపాయలు వంటకానికి తీయని రుచిని ఇవ్వడమే కాకుండా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

చిన్న ఉల్లిపాయల సాంబార్ తయారీకి కావలసిన పదార్థాలు
కందిపప్పు- 100 గ్రాములు
చిన్న ఉల్లిపాయలు (పొట్టు తీసినవి) - 20 నుండి 25
టమోటా - 1
చింతపండు - నిమ్మకాయంత
సాంబార్ పొడి - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నూనె - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
తాలింపుకి నూనె - 1 లేదా 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 3
ఆవాలు - అర టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
చిన్న ఉల్లిపాయల సాంబార్ తయారీ విధానం
-ముందుగా కందిపప్పును రెండుసార్లు శుభ్రంగా కడిగి, కుక్కర్ లో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన పప్పును గరిటెతో మెత్తగా మాష్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె లేదా కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేయండి. నూనె వేడెక్కాక, పొట్టు తీసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలను వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి మారాక, సన్నగా తరిగిన టమోటా ముక్కలను వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి.
-టమోటాలు బాగా మగ్గిన తర్వాత, అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుండి తీసిన రసాన్ని పోయాలి. దీనికి తగినన్ని నీళ్లు జతచేసి బాగా మరిగించండి.
-చింతపండు రసం మరుగుతున్నప్పుడు, అందులో సాంబార్ పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చింతపండు పచ్చివాసన పోయేదాకా మరిగించాక, ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న పప్పును ఇందులో వేసి కలపండి. సాంబార్ మీకు కావలసినంత చిక్కదనానికి తగినట్లుగా నీళ్లు అడ్జస్ట్ చేసుకుని, సన్నని మంట మీద 10 నిమిషాల పాటు మరిగించండి.
-సాంబార్ కు అసలైన రుచి వచ్చేది పోపుతోనే. స్టవ్ మీద మరో చిన్న కడాయి పెట్టి నూనె వేడి చేయండి. అందులో ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి. మరుగుతున్న సాంబార్ లో ఈ పోపును వేయగానే వచ్చే ఛుయ్ మనే శబ్దంతో పాటే, అద్భుతమైన సువాసన వస్తుంది.
-చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన చిన్న ఉల్లిపాయల సాంబార్ రెడీ.
-వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ ఉల్లి సాంబార్ కలుపుకుని తింటుంటే.. ఆ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications