Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
నోరూరించే క్రిస్మస్ ప్లమ్ కేక్..ఇంట్లోనే బేకరీ స్టైల్ లో ఎలా చేసుకోవాలంటే..
క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలు.. ప్రతిచోటా ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది క్రిస్మస్ కేక్ లేదా ప్లమ్ కేక్. మార్కెట్లో రకరకాల కేకులు అందుబాటులో ఉన్నప్పటికీ మన చేతులతో స్వయంగా తయారుచేసి, కుటుంబ సభ్యులకు వడ్డించడంలో ఉండే ఆనందం వెలకట్టలేనిది.
అయితే చాలామందికి ఇంట్లో ప్లమ్ కేక్ చేయడం కష్టమని, అది బేకరీలో లాగా పర్ఫెక్ట్ గా రాదని ఒక అపోహ ఉంటుంది. కానీ సరైన కొలతలు, సరైన విధానం తెలిస్తే ఎవరైనా అద్భుతమైన కేక్ ను తయారు చేయవచ్చు. ఈ క్రిస్మస్ పండుగకు మీ ఇంట్లో ఘమఘమలాడే ప్లమ్ కేక్ ను సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మైదా పిండి: 1 కప్పు (150-200 గ్రాములు)
బ్రౌన్ షుగర్: 200 గ్రాములు
వెన్న: 200 గ్రాములు
పెరుగు: 100 గ్రాములు
పాల పొడి: 1 టీస్పూన్
బేకింగ్ సోడా: చిటికెడు
బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్
దాల్చిన చెక్క పొడి: ఒక టీస్పూన్
ఉప్పు: 1 చిటికెడు
టుట్టి ఫ్రూటీ: అర కప్పు
కిస్మిస్: అర కప్పు
నారింజ రసం: 1 గ్లాసు
తయారీ విధానం
-కేక్ తయారీకి కనీసం గంట ముందు లేదా వీలైతే ఒక రోజు ముందుగా ఎండుద్రాక్ష, టుట్టి ఫ్రూటీలను నారింజ రసంలో నానబెట్టాలి. దీనివల్ల పండ్లు జ్యూస్ ను పీల్చుకుని మెత్తగా, రుచిగా మారతాయి.
-ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, పాల పొడి వేసి జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల కేక్ మృదువుగా వస్తుంది.
-మరొక పెద్ద గిన్నెలో వెన్న,బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం క్రీమ్ లాగా మారే వరకు గిలకొట్టాలి. ఆ తర్వాత అందులో పెరుగు వేసి మళ్ళీ కలపాలి.
-ఇప్పుడు వెన్న మిశ్రమంలో జల్లెడ పట్టిన మైదా పిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. చివరగా నారింజ రసంలో నానబెట్టిన ఎండుద్రాక్ష, టుట్టి ఫ్రూటీని ఈ మిశ్రమంలో వేసి కలపాలి.
-ఓవెన్ ను ముందుగా 170°C (డిగ్రీల)దగ్గర 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి.
-కేక్ టిన్ కు వెన్న రాసి కొంచెం మైదా చల్లాలి లేదా బటర్ పేపర్ వేయాలి. సిద్ధం చేసిన కేక్ మిశ్రమాన్ని టిన్ లో పోసి, పైన మరికొన్ని టుట్టి ఫ్రూటీలతో అలంకరించాలి.
-ఈ టిన్ ను ఓవెన్ లో పెట్టి 170 డిగ్రీల వద్ద సుమారు 40 నిమిషాల పాటు బేక్ చేయాలి. 35 నిమిషాల తర్వాత ఒక టూత్ పిక్ లేదా చిన్న కర్రతో కేక్ మధ్యలో గుచ్చి చూడండి. పిండి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే.
-కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్ లోకి మార్చుకుని ముక్కలుగా కట్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే క్రిస్మస్ ప్లమ్ కేక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications