Latest Updates
-
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే?
ఖర్జూర గింజలతో కమ్మనైన కాఫీ.. కెఫీన్ భయమే ఉండదు.!
ప్రకృతి మనకు వరంగా అందించిన పండ్లలోని ప్రతి ఒక్క భాగం
ఆరోగ్యకరమైనదనే విషయాన్ని చాలా మంది గుర్తించరు. పండ్లలోని తొక్క
మొదలుకుని గింజలవరకూ ఎన్నో పోషకాలు కలిగి ఉన్నాయి. కానీ ఇది తెలియక
ఫ్రూట్స్ మాత్రం తిని వాటిలోని గింజలను పడేస్తుంటారు. అలాగే
ఖర్జూరాలు కూడా. వాటి గింజలు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి.
వీటితో పౌడర్ తయారుచేసుకుని కెఫీన్ లేని కాఫీ
రుచిని ఆస్వాదించవచ్చు.

టీ, కాఫీలలో ఉండే కెఫీన్ కారణంగా కొందరు వాటికి దూరంగా ఉంటారు. గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. వీటిలో చాలా తక్కువ మొత్తంలో కెఫీన్ ఉంటుంది. అయితే ఖర్జూర గింజలతో తయారు చేసే కాఫీ పౌడర్‌లో అసలు కెఫీన్ అనే పదార్థమే ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లు ఫైబర్, హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్, ఖనిజాలు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తద్వారా ఇది జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేస్తూ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. ఖర్జూర గింజలతో తయారు చేసే కాఫీ పౌడర్‌ను ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
కావాల్సిన పదార్థాలు
ఖర్జూర గింజలు- 10 లేదా 12
నీరు లేదా పాలు- ఒక కప్పు
తేనె లేదా బెల్లం- రుచికి తగినంత
దాల్చినచెక్క పొడి- కొద్దిగా(కావాలనుకుంటే)
ఖర్జూర గింజల పౌడర్ తయారుచేసే విధానం
-ముందుగా, ఖర్జూర గింజలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత, వాటిని ఎండలో లేదా ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టాలి. అనంతరం వీటిని ఒక బాణలిలో చిన్న మంట మీద 15 నుంచి 20 నిమిషాల పాటు దోరగా వేయించాలి. కాసేపటికి గింజలు ముదురు గోధుమ రంగులోకి మారుతుంది. అప్పుడు నుంచి మంచి కాఫీ వాసన రావడం ప్రారంభమవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గింజలను ఓ ప్లేట్‌లో వేసుకోవాలి.
-వేయించిన గింజలు బాగా చల్లారిన తర్వాత.. వాటిని మిక్సర్ లేదా గ్రైండర్‌లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. మెత్తగా అవ్వలేదు అనుకుంటే ఓసారి జల్లెడ పట్టి బరకగా వచ్చిన పొడిని మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తాన్ని చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.
-ఇప్పుడు టీ తయారు చేసుకునే గిన్నెలో నీళ్లు లేదా పాలు వేడి చేసుకోవాలి. తర్వాత 2 టీస్పూన్ల ఖర్జూర గింజల పొడిని కలిపి 5 నిమిషాల పాటు సన్నని మంట మీద మరగనివ్వాలి. ఇప్పుడు ఓ కప్ తీసుకుని అందులో తేనె లేదా బెల్లం వేసుకుని కాఫీని వడకట్టి పోసుకోవాలి. ఓ సారి స్పూన్‌తో కలుపుకుని వేడివేడిగా ఖర్జూర గింజల కాఫీని ఆస్వాదించడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
