కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్!

Posted By:

కాలీప్లవర్ తో ఎప్పడూ పులసు, ఫ్రై, గోబీ వంటకాలు తయారుచేయడం మనం చూస్తుంటాం. అయితే పకోడీలను మించిన టేస్ట్ తో చేసే కాలిఫ్లవర్ ఫ్రై ఇంట్లో ఈజీగా తయారుచేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్ గా తినడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. కరకరలాడుతూ భలే రుచిగా ఉంటది.ఇది సాధారణ పకోడీల కంటే ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉంటుంది. పిల్లలు సైతం దీని రుచికి ఫిదా అయిపోతారు.

అకస్మాత్తుగా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తక్కువ సమయంలోనే వాళ్లకి ఏదైనా వెరైటీగా చేసి పెట్టాలనుకుంటే, ఈ స్నాక్ బెస్ట్ ఆప్షన్. పైగా ఈ ఫ్రై చేసిన ముక్కలతో మీరు మంచూరియా కూడా సులభంగా చేసుకోవచ్చు. తక్కువ సమయంలో ఇంట్లోనే ఈ క్రిస్పీ కాలిఫ్లవర్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Crispy Cauliflower Fry Recipe in Telugu Quick Easy Evening Snack at Home

క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు

-కాలీఫ్లవర్
-ఉప్పు
-గుడ్లు
-కార్న్ ఫ్లోర్
-నూనె

కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పులిహోర..చాలా కమ్మని రుచిగా చేసుకోండిలా..

కాలీఫ్లవర్ ఫ్రై తయారీ విధానం

-ముందుగా తాజా క్యాలీఫ్లవర్ పువ్వులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో ఒక టీస్పూన్ ఉప్పు వేసి ఈ ముక్కలను శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల వాటిలోని మురికి పూర్తిగా పోతుంది.

-ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రెండు గుడ్డు సొనలు, రెండు టీస్పూన్ల క్రిస్పీ ఫ్రైయింగ్ పౌడర్ (మీ దగ్గర అది లేకపోతే కార్న్‌ఫ్లోర్ వాడవచ్చు) వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది పెరుగు లాంటి చిక్కటి పేస్ట్‌ లా మారాలి. ఈ మిశ్రమాన్ని కట్ చేసుకున్న ముక్కలపై వేసి, ఆ పేస్ట్ ముక్కలన్నింటికీ సమానంగా మందపాటి పొరలా పట్టేలా చేతులతో బాగా కలుపుకోవాలి.

-తర్వాత స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనెను కడాయిలో పోసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, పిండి పట్టించిన ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. ముక్కలు మంచి బంగారు రంగులోకి మారి, కరకరలాడే వరకు వేయించి తీసేయాలి.

-అంతే కరకరలాడే క్రిస్పీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ.

-వేడివేడి ముక్కల పైన కాస్త పెరిపెరి మసాలా కానీ, చాట్ మసాలా కానీ చల్లండి. పిల్లలకు ఇచ్చేటప్పుడు కేవలం ఉప్పు, చాట్ మసాలా చల్లి ఇస్తే ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.

[ of 5 - Users]
Story first published: Wednesday, November 4, 2026, 19:16 [IST]
Desktop Bottom Promotion