Latest Updates
-
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు
చామదుంపలతో ఇలా చేస్తే మటన్, చికెన్ చాప్స్ కూడా దేనికీ పనికిరావు!
మీ ఇంట్లో చామదుంపలు ఉన్నాయా? అయితే వాటి నునుపుదనం, జిగురు వల్ల వాటిని వండటానికి లేదా తినడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారా? అయితే చామదుంపలతో ఒకసారి చాప్స్ చేసి చూడండి. ఈ చామదుంపల చాప్స్ కరకరలాడుతూ, కారంగా, ఎంతో అద్భుతంగా ఉంటాయి. మటన్, చికెన్ చాప్స్ లాగా ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ చాప్స్ ను స్నా క్లాగా అలాగే తినవచ్చు లేదా సాంబార్ అన్నం, రసం అన్నం, పెరుగు అన్నం లాంటి వాటికి సైడ్ డిష్ గా తీసుకుంటే ఆ రుచే వేరు.

చామదుంపల చాప్స్ తయారీకి కావలసిన పదార్థాలు
చామదుంపలు - 1/2 కేజీ
నీరు - ఉడకబెట్టడానికి సరిపడా
వెల్లుల్లి - 5 రెబ్బలు
అల్లం - 2 అంగుళాల ముక్క
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
సాంబార్ ఉల్లిపాయలు- 10
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - 5
తురిమిన పచ్చి కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
మ్యారినేషన్ మరియు వేయించడానికి:
కారం పొడి - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం పొడి - 1 టీస్పూన్ (మంచి రంగు కోసం)
పసుపు పొడి - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వేరుశెనగ నూనె - 3 టేబుల్ స్పూన్లు
చామదుంపల చాప్స్ తయారీ విధానం
-ముందుగా అర కేజీ చామదుంపలను శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్రెషర్ కుక్కర్ లో వేసి, అవి మునిగేంత వరకు నీళ్లు పోయాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-ఆవిరి పోయాక మూత తీసి, ఒక చాకుతో దుంపను గుచ్చి చూడాలి. అది సులభంగా లోపలికి దిగితే పర్ఫెక్ట్ గా ఉడికినట్లు. ఇప్పుడు నీటిని వంపేసి, దుంపల పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
-ఒక మిక్సీ జార్ లో వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, చిన్న ఉల్లిపాయలు, కశ్మీరీ ఎండు మిరపకాయలు, తురిమిన కొబ్బరి వేసి కొద్దిగా నీళ్లు చల్లి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఉడికించిన చామదుంపలను ఒక గిన్నెలోకి తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలకు కారం పొడి, కాశ్మీరీ కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి పట్టించాలి. ఆ తర్వాత మిక్సీలో రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను కూడా వేసి ముక్కలన్నింటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి.
-చివరగా, స్టవ్ మీద ఒక వెడల్పాటి పాన్ పెట్టి, అందులో 3 టేబుల్ స్పూన్లనూనె పోసి వేడి చేశాక మసాలా పట్టించిన చామదుంప ముక్కలను అందులో వేసి, పైన కొద్దిగా కరివేపాకు చల్లాలి. తక్కువ మంట మీద సుమారు అటూ ఇటూ తిప్పుతూ, అవి కరకరలాడే వరకు రోస్ట్ చేయాలి.
-అంతే చామదుంపల చాప్స్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
