క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..

Posted By:

సమోసా అంటే ఇష్టం లేని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. సాయంకాల సమయంలో వేడి వేడి సమోసాలు తింటుంటే ఆ ఫీల్ మాటల్లో చెప్పలేనిది. అయితే మనం తరచుగా ఉల్లిపాయ సమోసా, ఆలూ సమోసా, కార్న్ సమోసా వంటివే ఎక్కువగా తింటుంటాం. అయితే రెగ్యులర్ గా తినే సమోసాలు కాకుండా టేస్ట్‌ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌ పీరియన్స్ కావాలంటే చీజ్ పనీర్ సమోసా ట్రై చేయాల్సిందే.

కరకరలాడే పైపొర.. దాన్ని కొరకగానే లోపల వేడిగా కరిగిపోయే చీజ్, కమ్మని పనీర్, స్వీట్ కార్న్, అలాగే మన నోటికి రుచినిచ్చే ఘాటైన మసాలాల కలయికతో చేసే ఈ సమోసాలు అద్భుతంగా ఉంటాయి. పిల్లలైతే ఈ చీజ్ సమోసాలను లొట్టలేసుకుంటూ తింటారు. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ జరిగినా లేదా వీకెండ్ స్పెషల్ స్నాక్స్ కావాలన్నా ఇది పర్ఫెక్ట్ స్టార్టర్.

Crispy Cheese Paneer Samosa Recipe in Telugu Easy Evening Snack at Home

చీజ్ పనీర్ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు

సన్నగా తురిమిన పనీర్ - 200 గ్రాములు
మోజారెల్లా చీజ్- 80 గ్రాములు
ప్రాసెస్డ్ చీజ్- 100 గ్రాములు
ఉడికించిన స్వీట్ కార్న్- అర కప్పు
ఇటాలియన్ సీజనింగ్ - 1 టేబుల్ స్పూన్
చిల్లీ ఫ్లేక్స్ - 1 టేబుల్ స్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
షెజ్వాన్ చట్నీ - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి- 4
కొత్తిమీర - కొద్దిగా

జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా

చీజ్ పనీర్ సమోసా తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో తురిమిన పనీర్, మోజారెల్లా చీజ్, ప్రాసెస్డ్ చీజ్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో ఇటాలియన్ సీజనింగ్, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే షెజ్వాన్ చట్నీ, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేస అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇటాలియన్ సీజనింగ్, షెజ్వాన్ చట్నీ వల్ల ఈ సమోసాకు అద్భుతమైన ఇండో-వెస్ట్రన్ ఫ్లేవర్ వస్తుంది.

-ఇప్పుడు మార్కెట్లో దొరికే సమోసా షీట్స్ లేదా ఇంట్లో తయారు చేసుకున్న మైదా పిండి షీట్స్ తీసుకొని కోన్ ఆకారంలో మడిచి.. అందులో పనీర్ చీజ్ మిశ్రమాన్ని నింపి సీల్ చేయాలి. తర్వాత స్టవ్ మీద బాండీలో వేడి వేడి నూనెలో మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.

-అంతే ఎంతో క్రంచీగా, లోపల క్రీమీగా ఉండే చీజ్ పనీర్ సమోసా రెడీ. దీన్ని టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేం

[ of 5 - Users]
Story first published: Monday, October 12, 2026, 13:27 [IST]
Desktop Bottom Promotion