Latest Updates
-
అధికంగా చెమట కారుతోందా? తీవ్రమైన ఆ వ్యాధికి ఇది సంకేతమే! -
ఎండల తీవ్రతతో నీరసిస్తున్నారా? వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఇవే బెస్ట్ డ్రింక్స్ -
మేష సంక్రాంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తం తప్పనిసరి! -
చికెన్, మటన్ కంటే బెస్ట్..ఇంట్లోనే కరకరలాడే ఫిష్ ఫ్రై చేసుకోండిలా.. -
వృషభం, తుల, మకర రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. నేడు మీ అదృష్టం ఎలా ఉంది? - శుక్రవారం, 10 ఏప్రిల్ 2026 -
బరువు తగ్గించే సూపర్ బ్రేక్ ఫాస్ట్..సోయా -శనగపప్పు కట్లెట్ చేసుకోండిలా.. -
విడాకుల కేసులో రూ. 5 కోట్ల భరణం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు! -
ఉదయం హడావిడిలో బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. కేవలం 10 నిమిషాల్లో శనగపిండి దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
కొత్త డేటింగ్ ట్రెండ్ టోలియమోరీ..ఆధునిక బంధాల్లో కొత్త విషం! -
వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి
పైన కరకరలాడుతూ,లోపల సాఫ్ట్ గా..నోట్లో వేస్తే కరిగిపోయే స్నాక్.. ఫిదా అవ్వాల్సిందే!
బంగాళదుంపలతో చేసే ఏ వంటకమైనా సరే ఇష్టపడని వారు బహుశా ఉండరు. అందులోనూ కరకరలాడే స్నాక్స్ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. బయట రెస్టారెంట్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మనం ఎంతో ఇష్టంగా తినే ఫేమస్ స్నాక్ హ్యాష్ బ్రౌన్స్. దీనికి కాస్త వెల్లుల్లి, పర్మేసన్ చీజ్ రుచిని జోడిస్తే.. అద్భుతమైన గార్లిక్ పర్మేసన్ హ్యాష్ బ్రౌన్స్ తయారవుతాయి.
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉంటూ నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ అద్భుతమైన స్నాక్ ని మీ ఇంట్లోనే చాలా సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
వెల్లుల్లి పర్మేసన్ హ్యాష్ బ్రౌన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పెద్ద బంగాళదుంపలు - 5
గుడ్డు - 1
కార్న్‌ఫ్లోర్- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
వెల్లుల్లి పొడి - 1 టేబుల్ స్పూన్
నల్ల మిరియాల పొడి - 1 టీస్పూన్
పర్మేసన్ చీజ్- అర కప్పు
నూనె - వేయించడానికిసరిపడా
వెల్లుల్లి పర్మేసన్ హ్యాష్ బ్రౌన్స్ తయారీ విధానం
-ముందుగా 5 పెద్ద బంగాళదుంపలను శుభ్రంగా కడిగి, పైన ఉన్న చెక్కు (పొట్టు) తీసేయండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి వేడి చేయండి. అందులో బంగాళదుంపలను వేసి కేవలం 10 నిమిషాల పాటు సగం ఉడికేలా ఉడికించండి.
-సగం ఉడికించిన బంగాళదుంపలను నీటిలో నుంచి బయటకు తీసి, పూర్తిగా చల్లారనివ్వాలి. అవి చల్లారిన తర్వాత ఒక వాటిని సన్నగా తురుముకోవాలి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో తురుముకున్న బంగాళదుంపల మిశ్రమం, ఒక గుడ్డును పగలగొట్టి వేయండి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, తురిమి పెట్టుకున్న పర్మేసన్ చీజ్ వేసి అన్నీ బాగా కలిసేలా చేతితో ముద్దలా కలుపుకోవాలి.
-ఈ మిశ్రమం రెడీ అయ్యాక, కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ ఓవెల్ (కోడిగుడ్డు ఆకారం) షేప్ లో హ్యాష్ బ్రౌన్స్ లాగా మందంగా ఒత్తుకోవాలి.
-తయారుచేసుకున్న హ్యాష్ బ్రౌన్స్ని ఒక ట్రేలో బేకింగ్ పేపర్ పరుచుకుని దానిపై వరుసగా పేర్చండి. ఆ ట్రేని కనీసం ఒక గంట పాటు డీప్ ఫ్రీజర్ లో పెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఫ్రైకి సరిపడా నూనె పోయండి. నూనె వేడెక్కాక మంటను తగ్గించండి. ఫ్రీజర్ నుంచి హ్యాష్ బ్రౌన్స్ని తీసి, వేడి నూనెలో ఒకేసారి 3 లేదా 4 చొప్పున వేయండి. రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, సుమారు 4 నిమిషాల పాటు వేయించుకుని తీసేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే గార్లిక్ పర్మేసన్ హ్యాష్ బ్రౌన్స్ రెడీ అయిపోయినట్లే. టొమాటో కెచప్ లేదా మయోన్నైస్ డిప్ తో వీటిని సర్వ్ చేస్తే.. ఆ రుచి మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










