Latest Updates
-
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.! -
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.! -
డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్? -
రేవతీ నక్షత్రంలోకి శని సంచారం..ఈ 5 రాశులకు మహర్దశ.. మీ రాశి ఫలం ఇప్పుడే చెక్ చేసుకోండి.. -
Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు! -
శ్రావణ మాసం స్పెషల్.. అమ్మవారికి ప్రీతికరమైన కొబ్బరి బూరెలు.. అరిసెలను మించే రుచితో.! -
గుంటూరు స్టైల్ కాకరకాయ కారం ఇలా చేస్తే.. కూర మొత్తం ఒక్కరే తినేస్తారు, గ్యారెంటీ!
మనం తినే ఆహారంలో దాగిన 5 మహా దోషాలు.. ఇవి తెలుసుకోకుంటే ఎన్నో అనర్థాలు!
ఆహారం ఎలా ఉంటే మనసు అలా ఉంటుంది.. ఇది మన భారతీయ సనాతన ధర్మం చెప్పిన ఒక గొప్ప సత్యం. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం కేవలం మన కడుపు నింపి, శరీరానికి శక్తిని మాత్రమే ఇవ్వదు..మన ఆలోచనలను, మన గుణగణాలను, వ్యక్తిత్వాన్ని కూడా నిర్మిస్తుంది.
అయితే మనం తీసుకునే ఆహారంలో ప్రధానంగా ఐదు రకాల దోషాలు దాగి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దోషాలు ఉన్న ఆహారం మన శారీరక, మానసిక ఆరోగ్యాలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. ఆ ఐదు మహా దోషాలు ఏమిటో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ చూడండి.

అర్థ దోషం (సంపాదనలో లోపం)
మనం తినే ఆహారం ఏ రకమైన సంపాదనతో కొనుగోలు చేశామన్నది అత్యంత కీలకం. అన్యాయంగా, ఇతరులను మోసం చేసి, అక్రమంగా సంపాదించిన డబ్బుతో కూడు తింటే అది అర్థ దోషం అవుతుంది.
కథ: ఒక గొప్ప నిష్టాగరిష్ఠుడైన సాధువు ఒకసారి అక్రమ మార్గాల్లో డబ్బు గడించే తన శిష్యుని ఇంట్లో భోజనం చేశాడు. ఆ పాపపు కూడు తిన్న ప్రభావం వల్ల, ఎంతో తపశ్శక్తి ఉన్న ఆ మహా సాధువుకు కూడా బుద్ధి మందగించి, ఆ శిష్యుడి ఇంట్లోనే దొంగతనం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది.
నీతి: కష్టపడి, న్యాయబద్ధంగా సంపాదించిన సొమ్ముతో తినే గంజినీళ్లయినా సరే మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.
నిమిత్త దోషం (వ్యక్తి లేదా వాతావరణ లోపం)
ఆహారం పెట్టేవారికి చెడు బుద్ధి ఉన్నా, అపరిశుభ్రతతో ఉన్నా ఈ దోషం కలుగుతుంది.
కథ: మహాభారత యుద్ధంలో బాణాల మంచం మీద ఉన్న భీష్ముడిని ద్రౌపది ఒక ప్రశ్న అడిగింది.. తాతా.. నాడు నా వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు మీ విచక్షణా జ్ఞానం ఏమైంది? మీరెందుకు మౌనంగా ఉన్నారు? అని. అప్పుడు భీష్ముడు, అమ్మా నాడు దుర్యోధనుడు పెట్టిన పాపాన్నం తినడం వల్ల నా విచక్షణా జ్ఞానం నశించింది. ఇప్పుడు అర్జునుడి బాణాలకు ఆ పాత రక్తం అంతా పోవడం వల్ల నా బుద్ధి మళ్ళీ వికసించింది అని సమాధానం ఇచ్చాడు.
స్థాన దోషం (ప్రదేశం, వడ్డించే తీరులో లోపం)
ఆహారం వండే ప్రదేశంలో ఉండే ప్రతికూల వాతావరణం, వడ్డించే వారిలో ప్రేమ లేకపోవడం వల్ల ఈ దోషం వస్తుంది.
కథ: శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు గర్వంతో ఏర్పాటు చేసిన 56 రకాల విందును సున్నితంగా తిరస్కరించాడు. కానీ విదురుని భార్య ఎంతో భక్తితో, ప్రేమతో ఇచ్చిన అరటిపండు తొక్కను సైతం అమృతంలా ఆస్వాదించాడు. వడ్డించే చేతిలో ప్రేమ ఉన్నప్పుడే ఆ వంటకు సార్థకత.
గుణ దోషం (ఆహార స్వభావంలో లోపం)
మనం తీసుకునే ఆహారమే మన గుణాలను శాసిస్తుంది. స్వచ్ఛమైన సాత్వికాహారం మనసును ప్రశాంతంగా ఉంచి, ఆధ్యాత్మికాభివృద్ధికి తోడ్పడుతుంది. అదే మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, మాంసాహారం వంటి రజో, తమో గుణాలున్న పదార్థాలు మనిషిని లౌకిక మాయలో పడేసి, కామక్రోధాలను, స్వార్థాన్ని పెంచుతాయి.
సంస్కార దోషం (వండేవారి మానసిక స్థితి)
ఆహారం వండేవారి ఆలోచనలు, సంస్కారాన్ని బట్టి ఈ దోషం ఏర్పడుతుంది. వండేవారు ఎంత సంస్కారవంతులైతే ఆ వంట అంత అమృతంలా మారి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాకాకుండా కోపంతో, చిరాకుతో, ద్వేషంతో చేసే వంట.. తినేవారికి లేని రోగాలను, మానసిక అశాంతిని తెచ్చిపెడుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ప్రశాంతమైన మనసుతో, భగవన్నామ స్మరణ చేస్తూ వండాలని మన పెద్దలు చెబుతారు.



Click it and Unblock the Notifications