కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్‌ కార్న్ రెడీ!

Posted By:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం లేదా సాయంత్రంస్నాక్ కోసం ఏదైనా కొత్తగా, సులభంగా చేసుకునే వంటకం కోసం వెతుకుతున్నారా? అయితే మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిన అద్భుతమైన రెసిపీ రైస్ పాప్‌ కార్న్. దీనికోసం మీరు అన్నం వండాల్సిన అవసరమే లేదు.

కేవలం పచ్చి బియ్యాన్ని నానబెట్టి, ఉడికించిన బంగాళదుంప, కొన్ని మసాలాలు జోడించి క్షణాల్లో ఈ నోరూరించే స్నాక్ తయారుచేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడి తింటారు. రైస్ పాప్ కార్న్ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Crispy Crunchy Rice Popcorn Recipe in Telugu Quick Delicious Breakfast Snack

రైస్ పాప్ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి బియ్యం - 1 కప్పు
ఉడికించిన బంగాళదుంప - 1
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఎండు మిరపకాయల పేస్ట్ లేదా దంచిన చిల్లీ ఫ్లేక్స్ - 2 టీస్పూన్లు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీస్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు!

రైస్ పాప్ కార్న్ తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు పచ్చి బియ్యాన్ని తీసుకుని, నీళ్లలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి 2 నుంచి 3 గంటల పాటు బాగా నానబెట్టాలి.

-బియ్యం బాగా నానిన తర్వాత, అందులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. ఆ బియ్యాన్ని ఒక మిక్సీ జార్‌ లో వేసుకుని బరకగా కరకరలాడేలా రుబ్బుకోవాలి. నీళ్లు అస్సలు పోయకూడదు. పిండి మరీ మెత్తగా లేదా నీళ్లలాగా మారితే పాప్‌ కార్న్ సరిగ్గా రాదు.

-బరకగా రుబ్బుకున్న బియ్యపు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ముందుగా ఉడికించి, మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను వేసి బాగా కలపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు మిరపకాయల పేస్ట్, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత, చేత్తో బాగా కలపాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచండి. పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా (పాప్‌ కార్న్ సైజులో) చేసుకుంటూ జాగ్రత్తగా నూనెలో వేయాలి.

-ఉండలు మరీ పెద్దగా ఉంటే లోపల సరిగ్గా ఉడకవు. గరిటెతో అటూ ఇటూ తిప్పుతూ, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా కరకరలాడేదాకా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్‌ లోకి తీసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన వేడివేడి రైస్ పాప్‌ కార్న్ రెడీ. వీటిని టొమాటో కెచప్ లేదా మీకు ఇష్టమైన చట్నీతో అద్దుకుని తింటుంటే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Thursday, September 17, 2026, 9:10 [IST]
Desktop Bottom Promotion