Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పిండి రుబ్బే పనిలేదు,నానబెట్టే అవసరమే లేదు..10 నిమిషాల్లో హోటల్ స్టైల్ క్రిస్పీ రైస్ దోశ!
పప్పులు నానబెట్టాల్సిన పనిలేదు, పిండి పులియాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం ఇంట్లో ఉండే బియ్యం పిండితో, చిటికెలో హోటల్ స్టైల్ క్రిస్సీ దోశను రెడీ చేసుకోవచ్చు.
ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి వంటి వాటిని జోడించడం వల్ల ఇది రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.హోటల్ స్టైల్లో అప్పటికప్పుడు క్రిస్పీ రైస్ దోశ తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి: 1 కప్పు
బొంబాయి రవ్వ (సుజీ): 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు: 2-3 టేబుల్ స్పూన్లు
క్యారెట్ తురుము: 2-3 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 2-3
జీలకర్ర: 1 టీస్పూన్
మిరియాల పొడి: 1 టీస్పూన్
కరివేపాకు: 5-6 రెబ్బలు
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: దోశలు కాల్చడానికి సరిపడా
నీళ్లు: పిండి కలపడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోండి. అందులో ఒక కప్పు బియ్యం పిండిని వేయండి. ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మృదువుగా ఉండేలా చూసుకోండి.
-సిద్ధం చేసుకున్న పిండిలో 1 టీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కరివేపాకు,కొత్తిమీర వేయాలి. వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలా ఒకసారి కలపండి.
-రైస్ దోశ ఎప్పుడూ పల్చగా ఉంటేనే క్రిస్పీగా వస్తుంది. కాబట్టి ఈ మిశ్రమంలో సుమారు రెండు కప్పుల నీళ్లు పోసి, మజ్జిగలా పల్చగా జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టండి. తర్వాత దీనికి 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కలపండి. ఈ రవ్వ వల్ల దోశకు మంచి రంగు,కరకరలాడే గుణం వస్తుంది.
-స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టండి. పెనం బాగా వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచండి. పిండిని గరిటెతో తీసుకుని పెనం అంచుల నుండి మధ్యలోకి వచ్చేలా పోయాలి (సాధారణ దోశలా రుద్దకూడదు). ఇలా చేయడం వల్ల దోశలో చిన్న చిన్న రంధ్రాలు వచ్చి బాగా కాలుతుంది. దోశ చుట్టూ, మధ్యలో కొద్దిగా నూనె వేయండి.
-దోశ ఒక వైపు బంగారు రంగులోకి మారి, క్రిస్పీగా తయారయ్యాక రెండో వైపుకు తిప్పి మరో నిమిషం పాటు కాల్చుకోండి. అంతే ఎంతో రుచికరమైన, వేడివేడి క్రిస్పీ రైస్ దోశ రెడీ.
-దీనిని పల్లీల చట్నీ లేదా తాజా కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. సాయంత్రం వేళ పిల్లలకు, పెద్దలకు ఇది ఒక పర్ఫెక్ట్, లైట్ వెయిట్ స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications