Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
స్వీట్ షాప్ స్టైల్ పెసరపప్పు పకోడీ మీ ఇంట్లోనే ఈజీగా.. వాళ్ల సీక్రెట్ మసాలా ఇదే!
చల్లటి వాతావరణంలో టీ తాగుతూ పకోడీలు తింటుంటే ఆ మజాయే వేరు. అయితే మనం ఇంట్లో చేసే పకోడీలకు.. పెళ్లిళ్లలో లేదా స్వీట్ షాపుల్లో దొరికే జాలీ లాంటి పెసరపప్పు మంగోడీ (పకోడీ)లకు చాలా తేడా ఉంటుంది. బయట దొరికేవి లోపల మృదువుగా, బయట కరకరలాడుతూ అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ వర్షాకాలంలో అలాంటి అచ్చమైన స్వీట్ షాప్ రుచితో పెసరపప్పు పకోడీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పెసరపప్పు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పెసరపప్పు
-ధనియాలు
-సోంపు
-వాయు
-జీలకర్ర
-నూనె
-ఎండుమిర్చి
-పసుపు
-కారం
-ఉప్పు
-ఇంగువ
-అల్లం
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-కసూరి మేతి
-శెనగపిండి
-బేకింగ్ సోడా
-కొత్తిమీర
పెసరపప్పు పకోడీ తయారీ విధానం
-ఈ పకోడీల తయారీలో అత్యంత కీలకమైనది పప్పును రుబ్బే విధానం. ముందుగా ఒకటిన్నర కప్పుల పెసరపప్పును తీసుకుని, శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఆ తర్వాత పప్పును సుమారు రెండు గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
-పప్పు బాగా ఉబ్బిన తర్వాత, అందులోని నీటిని పూర్తిగా వడకట్టేయాలి. ఇప్పుడు పప్పును మిక్సీ జార్ లో వేసి గరుకుగా (కొద్దిగా బరకగా) రుబ్బుకోవాలి. రుబ్బేటప్పుడు నీటిని అస్సలు వాడకూడదు. మరీ ఇబ్బందిగా ఉంటే ఒకట్రెండు చెంచాల నీళ్లు మాత్రమే చల్లాలి. పిండి మరీ మెత్తగా పేస్ట్ లా అయిపోతే పకోడీలకు ఆ కరకరలాడే స్వభావం రాదు.
-స్వీట్ షాప్ పకోడీల అసలు రహస్యం వారు వాడే ప్రత్యేకమైన మసాలాలోనే దాగి ఉంది. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో రెండు టీస్పూన్ల ధనియాలు, ఒక టీస్పూన్ సోంపు, ఒక టీస్పూన్ వాము, ఒక టీస్పూన్ జీలకర్ర వేయాలి. వీటిని సన్నని మంటపై కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించాలి. అవి కొద్దిగా వేగాక, నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి ఒక్కసారి బరకగా పొడి చేసుకోవాలి.
-ఈ మసాలా పొడిని రుబ్బి పెట్టుకున్న పప్పు పిండిలో వేసి కలపాలి. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక టీస్పూన్ కారం, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కాశ్మీరీ ఎండుమిర్చి పొడి, కొత్తిమీర, గుప్పెడు కసూరి మేతి వేసి పిండిని బాగా కలుపుకోవాలి.
-పిండికి సరైన ఆకృతి, బైండింగ్ రావడానికి.. పిండిలో రెండు టీస్పూన్ల శనగపిండి, రెండు టీస్పూన్ల వేడి నూనె వేసి కలపాలి. పకోడీలు వేయడానికి ముందు, రెండు చిటికెల బేకింగ్ సోడా వేసి, ఒక టీస్పూన్ నీళ్లు పోసి సోడాను కలుపుకోవాలి. దీనివల్ల పకోడీలకు లోపల స్పాంజ్ ఆకృతి వస్తుంది.
-ఇప్పుడు వేడి నూనెలో జల్లెడ ద్వారా గానీ, చేతులతో గానీ కొద్దికొద్దిగా పిండిని వేయాలి. వేసేటప్పుడు మంట ఎక్కువగా ఉండాలి, అప్పుడే అవి అంటుకోవు. కొద్దిసేపటి తర్వాత మంటను మీడియంకి తగ్గించి, పకోడీలు బంగారు రంగులోకి మారి కరకరలాడే వరకు వేయించాలి.
-వేడివేడిగా సిద్ధమైన కరకరలాడే పెసరపప్పు పకోడీలను ప్లేట్లోకి తీసుకుని.. నూనెలో వేయించిన పచ్చిమిర్చితో గానీ, పుల్లటి చింతపండు చట్నీ లేదా గ్రీన్ చట్నీతో తింటే ఆ రుచి అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications