Latest Updates
-
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.!
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే..
సాధారణంగా మనం బంగాళదుంపలతో రోజూ కూరలు, ఫ్రైలు, పరాటాలు లేదా వేడి
వేడి పకోడీలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడూ అవే తిని మీకు బోర్
కొట్టిందా? అయితే ఈ సారి కాస్త భిన్నంగా, ఎంతో రుచికరంగా ఉండే పొటాటో
రింగ్స్ ట్రై చేయండి.
బయట కరకరలాడుతూ, లోపల నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉండే ఈ
స్నాక్ పిల్లలకే కాదు, పెద్దలకూ భలే నచ్చుతుంది.
దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఇంట్లో రెగ్యులర్‌గా ఉండే వస్తువులతోనే కేవలం కొన్ని నిమిషాల్లో బంగాళదుంప రింగ్స్ చేసుకోవచ్చు. సాయంత్రం వేళ టీతో పాటు ఈ వేడి వేడి పొటాటో రింగ్స్ తింటుంటే ఆ మజాయే వేరు.

పొటాటో రింగ్స్ తయారీకి కావలసిన పదార్థాలు
ఉడికించిన బంగాళదుంపలు: 3-4
మొక్కజొన్న పిండి (కార్న్ ఫ్లోర్): 1 కప్పు
బియ్యప్పిండి: 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి: అర టీస్పూన్
కారం పొడి: అర టీస్పూన్
చాట్ మసాలా: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి
నీళ్లు: పిండి కలపడానికి
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
పొటాటో రింగ్స్ తయారీ విధానం
-ఉడికించిన బంగాళదుంపల పొట్టు తీసి, ఒక గిన్నెలో వేసి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఎక్కడా చిన్న ముక్కలు లేదా ఉండలు లేకుండా సాఫ్ట్ చగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే రింగులు పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేయాలి. ఆ వెంటనే మిరియాల పొడి, కారం, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలుపుకోవాలి.
-ఈ మిశ్రమాన్ని చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఆలూలో ఉండే తేమ సరిపోతుంది, ఒకవేళ పిండి పొడిగా అనిపిస్తేనే కొద్దిగా నీళ్లు చల్లి కలుపుకోండి.
-కలుపుకున్న పిండి నుండి చిన్న చిన్న ఉండలు తీసుకోండి. వాటిని చేతులతో పొడవుగా తాడులా రోల్ చేసి, ఆ రెండు చివరలను అతికించి గుండ్రటి ఉంగరం (రింగ్) ఆకారంలో చేసుకోవాలి. ఇదే తరహాలో పిండి అంతటినీ రింగుల్లా చేసి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి, నూనె పోసి వేడి చేయండి. నూనె బాగా కాగాక, మంటను మీడియంలో పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఒక్కో రింగ్ ను మెల్లగా నూనెలో వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి మారి, కరకరలాడే వరకు అటూ ఇటూ తిప్పుతూ వేయించుకోవాలి. ఆ తర్వాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో రింగ్స్ రెడీ. వీటిని పచ్చ చట్నీ, టమాటో సాస్ లేదా మీకు నచ్చిన ఏదైనా డిప్ తో వేడివేడిగా సర్వ్ చేయండి. వర్షం పడుతున్నా, చలిగా ఉన్నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
