Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
క్రిస్పీ సొరకాయ బజ్జీ.. వర్షాకాలపు సాయంత్రాలకు సరైన స్నాక్..ఎలా చేసుకోవాలంటే
సొరకాయ బజ్జీ అనేది తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక రుచికరమైన, క్రిస్పీ చిరుతిండి. సాధారణంగా సాయంత్రం వేళల్లో టీతో పాటు స్నాక్‌గా దీన్ని ఆస్వాదిస్తారు. సాయంత్రం స్నాక్ గా నైనా,పప్పుచారులో నంజుకోడానికి అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వర్షాకాలంలో వేడి వేడి సొరకాయ బజ్జీలను పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటో సాస్ లేదా సాదాగా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకొని తింటే ఆ టేస్ట్ ఎన్ని కోట్లు పెట్టినా రాదంతే. సొరకాయలో అధికంగా నీటి శాతం ఉండటం వల్ల బజ్జీలు బయట క్రిస్పీగా, లోపల మృదువుగా ఉంటాయి. సొరకాయ బజ్జి తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సొరకాయ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-లేత సొరకాయ
-ఉప్పు
-కారం
-శెనగపిండి
-బియ్యపుపిండి
-వాము
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ధనియాల పొడి
-కరివేపాకు
-కొత్తిమీర
-పసుపు
-ఆయిల్
సొరకాయ బజ్జీ తయారీ విధానం
-ముందుగా కాస్త లేతగా,కొద్దిగా సన్నగా ఉండే సొరకాయను తీసుకొని దానిని శుభ్రంగా కడిగి దానిమీద చెక్కును తొలగించండి.
-ఇప్పుడు దానిని మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా చక్రాల్లా కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఓ గిన్నెలో నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపి అందులో చక్రాల్లా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో ముప్పావుకప్పు శెనగపిండి, పావకప్పు పైనే బియ్యం పిండి, అర టీస్పూన్ వాము, 1 టీస్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, పావు టీస్పూన్ పసుపు, అర టీస్పూన్ కారం, సన్నగా తరిగిన కొత్తిమీర తురుము, సన్నగా కట్ చేసిన కరివేపాకు, అర టీస్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
-తర్వాత అందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని జారుడుగా ఉండేలా కలుపుకోవాలి. మరీ చిక్కగా కలపవద్దు..మరీ పల్చగా కూడా ఉండకూడదు.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చెయ్యండి.
-ఇప్పడు ఉప్పు నీళ్లలో ఉంచిన సొరకాయ ముక్కలను తీసి కలిపిన పిండిలో వేసి ఒక్కో ముక్కను పిండిలో ముంచి దానిని వేడెక్కిన నూనెలో వేసి వేయించాలి. గోల్డెన్ కలర్ లోకి మారి క్రిస్పీగా మారిన తర్వాత వాటిని నూనెలో నుంచి తీసేయాలి. అంతే టేస్టీ సొరకాయ బజ్జీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




