Latest Updates
-
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ!
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు!
చల్లటి సాయంత్రం వేళ.. చేతిలో వేడివేడి టీ కప్పు.. ఆ సమయంలో ఏదైనా కరకరలాడుతూ, కొద్దిగా కారంగా తినాలనిపించడం సహజం. రోజూ ఒకే రకమైన స్నాక్స్ తిని విసుగొచ్చి, ఈ రోజు కొత్తగా ఏం చేసుకోవాలో అర్థం కాక తరచుగా ఇబ్బంది పడుతుంటాం.
మీ సాయంత్రం ఆకలిని తీర్చడానికి, టీ రుచిని మరింత పెంచడానికి ఓ అద్భుతమైన స్నాక్ కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు. 10 నిమిషాల్లో తయారయ్యే ఈ రుచికరమైన స్నాక్ ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

వెల్లుల్లి మరమరాలు తయారీకి కావలసిన పదార్థాలు
ముర్మురాలు- 3 కప్పులు
వెల్లుల్లి రెబ్బలు - 10 నుండి 12
వేరుశెనగ గుళ్లు- అర కప్పు
పచ్చిమిర్చి - 2
తాజా కరివేపాకు - 12 ఆకులు
పసుపు - అర టీస్పూన్
కారం - అర టీస్పూన్
చాట్ మసాలా - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు!
వెల్లుల్లి మరమరాలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి కడాయిని పెట్టుకోండి. మంటను సిమ్ లో ఉంచి, అందులో మరమరాలను వేసి నూనె లేకుండా 2-3 నిమిషాల పాటు వేయించండి. ఇలా చేయడం వల్ల మరమరాలు మెత్తదనం పోయి మరింత కరకరలాడుతూ తయారవుతాయి. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కాక, వేరుశెనగ గుళ్లు(పల్లీలు) వేసి దోరగా, బంగారు రంగులోకి మారేంత వరకు వేయించండి. పల్లీలు కరకరలాడుతున్నప్పుడు.. దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిటికెడు ఇంగువ వేసి కలపండి. వెల్లుల్లి పచ్చివాసన పోయి, లేత బంగారు రంగులోకి మారేదాకా వేయించండి.
-ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించండి. ఈ తాలింపులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా చాట్ మసాలా వేసి బాగా కలపండి. మసాలాలు మాడిపోకుండా జాగ్రత్త పడాలి.
-మసాలాలు వేగిన వెంటనే, ముందుగా వేయించి పెట్టుకున్న మరమరాలను కడాయిలో వేయండి. మసాలాలు, వెల్లుల్లి ఫ్లేవర్ మరమరాలన్నింటికీ బాగా పట్టేలా అడుగునుండి నెమ్మదిగా కలుపుతూ ఉండండి. తక్కువ మంట మీద మరో రెండు నిమిషాలు వేయించి, స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే వెల్లుల్లి మరమరాలు రెడీ. సాయంత్రం టీ చప్పరిస్తూ, ఈ కరకరలాడే స్నాక్ తింటుంటే ఆ మజాయే వేరు. ఇది పూర్తిగా చల్లారాక, గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
