క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా..

Posted By:

స్నాక్ టైంలో తినడానికి, అలాగే వీకెండ్స్ లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పార్టీ చేసుకునే టైంలో తినడానికి జీడిపప్పు పకోడి బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. టేస్టీ, క్రంచీగా ఉండి ఎంత తిన్నా ఇంకా ఇంకా అనిపిస్తుందే తప్ప ఇక చాలు అనిపించేలా మాత్రం ఉండదు. జీడిపప్పు పకోడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు

నెయ్యి- 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు- 1 కప్పు
ఉప్పు- అర టీస్పూన్
కారం పొడి-అర టీస్పూన్
నల్ల ఉప్పు- పావు టీస్పూన్
ధనియాలు- 1 టీస్పూన్
సోంపు గింజలు- అర టీస్పూన్
జీరా- అర టీస్పూన్
పచ్చిమిర్చి- 2
కరివేపాకు-కొంచెం
శనగపిండి- 1 కప్పు
డీప్ ఫ్రై చేయడానికి- నూనె

Crunchy Tasty Cashew Nut Pakodi Recipe in Telugu How to Make Sweet Shop Style Kaju Pakora at Home

జీడిపప్పు పకోడి తయారీ విధానం

-ముందుగా రోట్లో టీస్పూన్ ధనియాలు, అర టీస్పూన్ సోంపు, అర టీస్పూన్ జీరా వేసి కచ్చాపచ్చాగా దంచుకొని ఈ పొడిని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడయ్యాక అందులో 1 కప్పు జీడిపప్పు వేసి 3-4 నిమిషాలు వేయించాలి.

-వేగిన జీడిపప్పుని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. వేయించిన జీడిపప్పుల మీద అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ నల్ల ఉప్పు, పసుపు, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పొడి వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, కరివేపాకు తరుగు, 1 టీస్పూన్ అల్లం తరుగు వేసి మొత్తం కలిసేలా చేత్తో కలుపుకోండి.

-ఇప్పుడు అందులో అరకప్పు శనగపిండి వేసి చాలా లైట్ గా నీళ్లు చిలకరించుకుంటూ జీడిపప్పుకి పట్టేలా కోట్ చేసుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వీటిని బాండీలో నుంచి తీసి ప్లేట్ లోకి తీసుకోండి. స్టవ్ ఆపేయండి.

-అంతే టేస్టీ జీడిపప్పు పకోడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, November 1, 2026, 10:58 [IST]
Desktop Bottom Promotion