విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఈ రోజుల్లో చాలామందికి కాళ్లు చేతులు లాగడం లేదా తిమ్మిర్లు పట్టడం, నోటి పూతసమస్యలు, నరాల బలహీనతలతో బాధపడుతూ హాస్పటల్స్ కు వెళ్తున్నారు..డాక్టర్లు విటమిన్ 12 లోపం ఉందని చెబుతున్నారు. అయితే ఈ లోపం తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది మేక లివర్ కర్రీ.

ఇది అన్నం, చపాతీ, జొన్ రొట్టెలు, రాగి ముద్దతో కలిపి తినడానికి యమా అద్బుతంగా ఉంటది. చాలామంది లివర్ కర్రీ వాసన నచ్చక పెద్దగా దానిని తినడానికి ఇష్టపడరు. అయితే ఎలాంటి వాసన లేకుండా మంచి ఫ్లేవర్ తో ఉండేలా లివర్ కర్రీ మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Cure Vitamin B12 Deficiency with this Tasty Goat Liver Curry Recipe in Telugu

మేక లివర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఉప్పు
-పసుపు
-మేక లివర్
-నిమ్మరసం
-టమాటో
-మసాలా దినుసులు
-కరివేపాకు
-పుదీనా
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-కారం

మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా..

మేక లివర్ కర్రీ తయారీ విధానం

-ముందుగా అర కేజీ మేక లివర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడగండి.

-ఒక గిన్నెలో బాగా కడిగిన తర్వాత మేక లివర్ ముక్కలు వేసి,ఇందులో 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసం ముక్కలు మునిగేంతవరకు నీళ్లు పోసి ఇదంతా ఒకసారి కలుపుకోండి. తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద ఒక పొంగు వచ్చేవరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ సేపు ఉడికిస్తే అందులోని విటమిన్స్ పోయే అవకాశం ఉంటది కాబట్టి జస్ట్ అందులోని వాసన పోవడానికి మాత్రమే 1 పొంగు వచ్చేదాకా ఉడికించాలి.

-తర్వాత అందులోని నీటిని పారబోసి ముక్కలను బయటకు తీసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోండి.

-ఇప్పుడు మసాలా తయారుచేసుకోవడం కోసం..స్టవ్ మీద పాన్ లేదా కడాయి పెట్టుకుని మంటను తగ్గించి, పాన్ లో పావు టీస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, పావు టీస్పూన్ సోంపు, 10 మిరియాలు, 4 యాలకలు, 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు రేకు, కొద్దిగా జాపత్రి వేసి కలునపుతూ క్రిస్పీగా అయ్యేదాకా వేయించాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి.

-తర్వాత బాగా పండిన 2 టమాటోలను గ్రేటర్ తో తురుముకుని తొక్కని పడేయాలి.

-తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని కూరకి సరిపడా నూనె వేసి వేడయ్యాక అందులో 2 ఉల్లిపాయల సన్నని తరుగు, కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చిలను కచ్చాపచ్చాగా దంచి వేసి కలుపుతూ వేయించాలి. ఇవి వేగాక నీళ్లల్లో నుంచి పక్కన తీసిపెట్టుకున్న లివర్ ముక్కలను ఇందులో వేసి 2-3 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.

-తర్వాత దానిమీద మూతపెట్టి మంటను తగ్గించి నెమ్మదిగా ఉడకనివ్వాలి. 5 నిమిషాలు నూనెలో ముక్కలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అర టీస్పూన్ పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుని కలిపి ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసి కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద కూర దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి.

-కూర దగ్గరగా అయిన తర్వాత మూత తీసి అందులో తురుముకున్న టమాటో ప్యూరీని వేసి కలిపి మూతపెట్టి కూర చక్కగా ఉడికి, ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించాలి.

-కూర ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆపేయండి.

-అంతే మేక లివర్ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Desktop Bottom Promotion