Latest Updates
-
తలనొప్పి, కీళ్లనొప్పులు, షుగర్.. అన్నింటికీ చెక్ పెట్టే అడవి బాదం! -
వెజ్ మంచూరియా చేసేటప్పుడు ఈ తప్పులు వద్దు.. స్ట్రీట్ స్టైల్ మాదిరి రావాలంటే ఇలా చేయండి.! -
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్
అచ్చం హైవే ధాబా రుచితో గుమగుమలాడే దాల్ ఫ్రై.. ఇంట్లోనే చాలా ఈజీగా!
ప్రతిరోజూ ఒకే రకమైన పప్పు, సాంబారు, రసం తిని బోర్ కొట్టిందా? ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? కేవలం పప్పు, టమాటాలు మాత్రమే ఉన్నాయా? అయితే ఏమాత్రం ఆలోచించకండి! అచ్చం హైవే పక్కన ఉండే ధాబాలలో దొరికే అద్భుతమైన దాల్ ఫ్రై ని మీ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోండి.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ దాల్ ఫ్రై కలుపుకుని తింటే... ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! చపాతీ, రోటీ, జీరా రైస్, దోశ..ఇలా దేనితో తిన్నా దీని రుచి అమోఘం. ఒక్కసారి దీన్ని రుచి చూశారంటే, వారానికి ఒక్కసారైనా కచ్చితంగా వండుకుంటారు.

దాల్ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు
పప్పు ఉడికించుకోవడానికి
కందిపప్పు - 1/4 కప్పు
పెసరపప్పు - 2 టేబుల్ స్పూన్లు
మసాలా కోసం
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన అల్లం - 1 టీస్పూన్
సన్నగా తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 1
ఉల్లిపాయ - 1 పెద్దది
టమాటా - 1
కారం - అర టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టేబుల్ స్పూన్
పసుపు - పావు టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
స్పెషల్ తడ్కా (పోపు) కోసం
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5
ఎండు మిరపకాయలు - 2
కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ - పావు టేబుల్ స్పూన్
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు!
దాల్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా కందిపప్పు, పెసరపప్పులను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేయండి. తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టి, మీడియం మంట మీద 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ప్రెషర్ పోయాక, పప్పును మెత్తగా ఎనిపి పక్కన పెట్టుకోండి.
-ఒక మందపాటి కడాయి తీసుకుని అందులో నూనె, నెయ్యి వేడి చేయండి. ఇందులో జీలకర్ర వేసి చిటపటలాడాక, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి పచ్చివాసన పోయేలా కొన్ని సెకన్ల పాటు వేయించండి. sరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి.. ఉల్లిపాయలు లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడ్డాక పసుపు, కారం, ధనియాల పొడి వేసి నూనె పైకి తేలేవరకు సన్నని మంటపై ఉడికించాలి.
-ఇప్పుడు ముందుగా మెత్తగా చేసి పెట్టుకున్న పప్పును ఈ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. పప్పు మరీ గట్టిగా ఉంటే అర కప్పు నుండి ఒక కప్పు వరకు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మూతపెట్టి మీడియం మంట మీద 10 నిమిషాల పాటు ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లుకుని పక్కన పెట్టుకోండి.
-ఈ దాల్ ఫ్రైకి ధాబా రుచినిచ్చేది చివరిలో వేసే పోపు. అందుకోసం ఒక చిన్న పాన్ లో నూనె, నెయ్యి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేయండి. వెల్లుల్లి దోరగా వేగాక, స్టవ్ ఆపేసి కాశ్మీరీ కారం వేయండి. వెంటనే ఈ పోపును గుమగుమలాడుతున్న పప్పుపై పోసి బాగా కలపండి.
-అంతే ఎంతో రుచికరమైన, కమ్మని ధాబా స్టైల్ దాల్ ఫ్రై రెడీ
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
