దీపావళి స్పెషల్.. రొటీన్‌ కు భిన్నంగా నోరూరించే గుంటూరు చికెన్ రోస్ట్.. ఈజీగా చేసుకోండిలా..

Posted By:

దీపావళి పండుగ అంటేనే వెలుగులు, పటాకుల చప్పుళ్లతో పాటు ఇల్లంతా ఘుమఘుమలాడే విందు భోజనం గుర్తుకొస్తుంది. పండుగ పూట మాంసాహార ప్రియుల ఇంట్లో చికెన్ లేనిదే ముద్ద దిగదు కదా. అయితే ప్రతిసారీ చేసుకునే రొటీన్ చికెన్ బిర్యానీ లేదా సాధారణ చికెన్ కర్రీతో బోర్ కొట్టిందా? అయితే ఈ దీపావళికి మీ డైనింగ్ టేబుల్ మీద ఒక స్పెషల్ డిష్ ఉండాల్సిందే. అదే కారం కారంగా, నోరూరించే అసలైన గుంటూరు చికెన్ రోస్ట్. అన్నం, పరోటా, బిర్యానీ.. ఇలా దేనిలోకైనా ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్. దీన్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు. స్పైసీ, టేస్టీ గుంటూరు చికెన్ రోస్ట్‌ ని సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

స్పెషల్ మసాలా పొడి కోసం:

ధనియాలు - 1 టేబుల్ స్పూన్
లవంగాలు - 5 లేదా 6
యాలకులు - 4
మరాఠీ మొగ్గ - పావు టీస్పూన్
అనాస పువ్వు - అర ముక్క
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
జీలకర్ర - అర టేబుల్ స్పూన్

చికెన్ రోస్ట్ కోసం:

చికెన్ - అర కిలో
నూనె - 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూన్లు
కరివేపాకు - 3 రెమ్మలు
కారం - ఒకటింబావు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2 లేదా 3
బిర్యానీ ఆకు - 1
నిమ్మకాయ - సగం
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు, పసుపు - తగినంత

Diwali Special Recipe How to Make Mouth Watering Guntur Chicken Roast at Home in Telugu

తయారీ విధానం

-ఒక పాన్ వేడి చేసి అందులో మసాలా దినుసులు (ధనియాలు, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, జీలకర్ర) వేసి సన్నని మంటపై మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. ఇవి చల్లారాక మిక్సీ జార్‌ లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఒక మందపాటి గిన్నెలో ఉప్పు, పసుపు వేసి కడిగిన చికెన్ ముక్కలను వేయండి. అందులోనే నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కొద్దిగా దాల్చినచెక్క, లవంగాలు, ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా ఉప్పు, బిర్యానీ ఆకు వేసి తగినన్ని నీళ్లు పోయండి. చికెన్ ముప్పావు వంతు (75శాతం) ఉడికే వరకు ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, చికెన్ ముక్కలను, ఆ చికెన్ ఉడికిన నీటిని విడివిడిగా పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె కాగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఆ తర్వాత మిగిలిన అర టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేలా దోరగా వేయించాలి.

ఎముకలను బలపరిచే పోషకాల నిధి.. దీపావళి పండుగ స్పెషల్ గా పెసరపప్పు పాయసం చేయండిలా..

-ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలపాలి. కాసేపటి తర్వాత కారం, మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌ లో ఉంచి, ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ నీళ్లు 3-4 టేబుల్ స్పూన్లు పోయండి. ఉప్పు సరిచూసుకుని, చికెన్ పూర్తిగా ఉడికి నూనె పైకి తేలేవరకు ఫ్రై చేయండి.

-చివరగా, నిమ్మరసం పిండి మరో 2 నిమిషాలు ఉడికించి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే చాలు... ఘుమఘుమలాడే స్పైసీ గుంటూరు చికెన్ రోస్ట్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, November 8, 2026, 14:29 [IST]
Desktop Bottom Promotion