Latest Updates
-
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.!
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే దొండకాయ రోటీ పచ్చడి.. ఇలా చేశారంటే ఇక కూరల జోలికి వెళ్లరు.!
పచ్చళ్లు అనగానే ఎవరికైనా ఇట్టే నోరూరిపోతుంది. అన్నంలో మొదటి ముద్దను పచ్చడితో స్టార్ట్ చేస్తాం. అలా అయితేనే భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి పచ్చళ్లలో ఒకటి దొండకాయ రోటీ పచ్చడి. ఈ పచ్చడిని ఇలా చేశారంటే ఒక ముద్దకి రెండు ముద్దలు తినేస్తారు. దొండకాయ రోటి పచ్చడిని ఎలా తయారుచేయాలో చూద్దాం..

దొండకాయ రోటీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
దొండకాయలు- పావు కేజీ
ధనియాలు- టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
పల్లీలు- రెండు టీస్పూన్లు
నువ్వులు- టీస్పూన్
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- 8
పచ్చిమిర్చి- 10(లేదా కారానికి సరిపడా)
కొత్తిమీర- కొద్దిగా
టమాటా- ఒకటి
చింతపండు- కొద్దిగా
ఉప్పు- రుచికి సరిపడా
పసుపు- పావు టీస్పూన్
నీళ్లు- రెండు టీస్పూన్లు
దొండకాయ రోటీ పచ్చడి తయారీ విధానం
దొండకాయ రోటీ పచ్చడి కోసం ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి గుండ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.!
ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి.

తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నూనె వేసి దొండకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ముక్కలు మెత్తబడి ఉడికేంత వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
కాసేపటికి టమాటా, చింతపండు వేసి కలిపి ఉడికించాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలుపులోవాలి. చివరిగా కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించుకోవాలి.
నోటికి రుచి, ఒంటికి బలం..రాగి మునగాకు కుడుములు ఎప్పుడైనా తిన్నారా?
ఇప్పుడు రోలు తీసుకుని శుభ్రం చేసి అందులో ధనియాలు, జీలకర్ర, పల్లీలు, నువ్వులు వేసి దంచి పౌడర్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకోవాలి.
చివరిగా దొండకాయ మిశ్రమాన్ని వేసి మెత్తగా రుబ్బుకోవాలి. రుచి చూసుకుని అవసరమైతే మరికాసింత ఉప్పు వేసుకోవాలి.
పచ్చడి మెత్తగా అయిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసుకోండి. స్పైసీ దొండకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది. వర్షాకాలంలో స్పైసీ ఫుడ్ కోరుకునే వారు తప్పకుండా ట్రై చేయాల్సిన సూపర్ పచ్చడి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
