Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నోటికి రుచి, ఒంటికి బలం..రాగి మునగాకు కుడుములు ఎప్పుడైనా తిన్నారా?
ఉరుకుల పరుగుల జీవితంలో రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే రాగి, విటమిన్లకు కేరాఫ్ అడ్రస్ అయిన మునగాకు కలిపి చేసే వంటకం అంటే.. అది కచ్చితంగా సూపర్ ఫుడ్ అనాల్సిందే. అదే రాగి మునగాకు కుడుములు. నోటికి రుచిగా, ఆరోగ్యానికి అద్భుతంగా అనిపించే రాగి మునగాకు కుడుములు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రాగి మునగాకు కుడుములు తయారీకి కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు (2-3 నిమిషాలు దోరగా వేయించుకోవాలి)
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నువ్వుల నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినప్పప్పు - 1 టేబుల్ స్పూన్
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
ఎండుమిర్చి - 2
పచ్చిమిర్చి - 1
అల్లం - అర అంగుళం ముక్క
ఇంగువ - చిటికెడు
ఉల్లిపాయ - 1
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు - 2 కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
మునగాకు - అర కప్పు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
రాగి మునగాకు కుడుములు తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, మంటను సిమ్ లో ఉంచి రాగి పిండిని 2 లేదా 3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో బియ్యం పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి.
-ఒక పాన్ లో నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు వేసి చిటపటలాడాక.. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చిటికెడు ఇంగువ వేసి కాస్త వేగనివ్వాలి. అందులోనే తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఉల్లిపాయలు మగ్గాక, పచ్చి కొబ్బరి తురుము వేసి మరో 30 సెకన్ల పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.
-నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు, మునగాకును అందులో వేసి ఒక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-వేడిగా ఉన్న నీటి మిశ్రమంలో వెంటనే మనం పక్కన పెట్టుకున్న రాగి, బియ్యం పిండి మిశ్రమాన్ని వేయాలి. అలాగే కొత్తిమీర కూడా చల్లి, పిండి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే అవసరాన్ని బట్టి మరో అర కప్పు వేడి నీళ్లు కలుపుకోవచ్చు. పిండి పగుళ్లు లేకుండా మెత్తని ముద్దలా అవ్వాలి.
-పిండి కాస్త చల్లారాక, చేతులకి కొద్దిగా నూనె రాసుకుని ఆ పిండిని చిన్న చిన్న కుడుములు ఆకారంలో లేదా రౌండ్ బాల్స్ లా చేసుకోవాలి. వీటిని ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్ లో పెట్టి, మీడియం మంట మీద 8 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
-అంతే ఎంతో రుచికరమైన రాగి మునగాకు కుడుములు రెడీ. వేడివేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీతో గానీ, కారపు పచ్చడితో గానీ తింటే అద్భుతంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications