Latest Updates
-
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా
దొండకాయ ఉల్లికారం..ఇలా చేశారంటే పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకొస్తారు!
దొండకాయతో అనేక రకాలు వెరైటీ వంటకాలు తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా దొండకాయ ఉల్లికారం తిన్నారా? ఒక్కసారి తిన్నారంటే ఆ రుచి కొన్నాళ్ల పాటు నోట్లోనే ఉండిపోతుంది. దొండకాయ అంటే నచ్చనివాళ్లకు కూడా ఒక్కసారి ఇది చేసిపెడితే లొట్టలేస్తూ తింటారు. అన్నం,రోటీ,చపాతీల్లోకి కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్. దొండకాయలో ఉండే పోషక విలువలు, ఉల్లిపాయల ఘాటు కలగలిసి ఈ వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా, రుచికరమైనదిగా మారుస్తాయి. దొండకాయ ఉల్లికారం చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-దొండకాయలు
-కారం
-ఉప్పు
-పసుపు
-ఉల్లిపాయ
-వెల్లుల్లి
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కరివేపాకు
-జీలకర్ర
-ఆయిల్
-చింతపండు
-ధనియాలు
-మినపప్పు
-శెనగపప్పు
-కొత్తిమీర

తయారీ విధానం
-ముందుగా అరకేజీ దొండకాయలను నీటిలో వేసి శుభ్రంగా కడగండి.
-కడిగిన దొండకాయలను గుత్తివంకాయను కట్ చేసే మాదిరి నాలుగు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో తాళింపు వేయడానికి తగినంత ఆయిల్ వేసి అందులో రెండు స్పూన్ల శెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 6 వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్ గా ఫ్రై చేశాక ఇందులో 3 ఉల్లిపాయల చీలికలు, అర టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం చింతపండు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఓ ప్లేట్ లోకి ఈ తాళింపుని తీసుకొని చల్లారనివ్వండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఆవాలు,జీలకర్ర, దొండకాయలు, పసుపు, అ్లలంవెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కలిపి మూతపెట్టి ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి.
-ఈలోగా ప్లేట్ లో పక్కన ఉంచుకున్న తాళింపు మిశ్రమాన్ని మిక్సీలో వేసి ఇందులోనే 3 స్పూన్ల కారం,1 స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఈ పేస్ట్ ను ఇప్పుడు ఫ్రై అవుతున్న దొండకాయల్లో వేసి బాగా కలపాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోండి.
-చివరగా కూరలో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ.
కొన్ని ప్రయోజనాలు
దొండకాయలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను
మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ప్రేగుల
ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దొండకాయలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరాన్ని
వ్యాధుల నుండి రక్షిస్తాయి. దొండకాయలో విటమిన్ B1, B2, B3, B6, B9
వంటి బి విటమిన్లు ఉంటాయి. ఇవి నరాల వ్యవస్థ పనితీరుకు కీలకమైనవి,
మొత్తం నరాల ఆరోగ్యానికి దోహదపడతాయి. మతిమరుపు, అల్జీమర్స్ వంటి వాటి
లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
