Latest Updates
-
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు.. -
ఖర్చు లేని హెల్త్ ఇన్స్యూరెన్స్..మీ బంధుమిత్రులకు ఇలా యోగా డే విషెస్ చెప్పండి -
Happy Father's Day 2026: కనిపించే దేవుడు నాన్న..హార్ట్ టచింగ్ ఫాదర్స్ డే విషెస్, కోట్స్, స్టేటస్ లు -
యోగా చేసిన తర్వాత తినాల్సిన హెల్తీ ఫుడ్స్..ఎలా చేసుకోవాలో చూడండి -
బాగా బిజీగా ఉండేవాళ్ల కోసం 5 బెస్ట్ యోగాసనాలు..తక్కువ టైంలో అద్భుత ప్రయోజనాలు -
వంద రకాల టమాటా చట్నీలలో ఆరోగ్యానికి, రుచికి బెస్ట్ ఇదే..టమాటా మిరియాల చట్నీ చేసుకోండిలా.. -
ఈరోజు సిద్ధి యోగం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
స్లోవేకియా స్పీకర్ కు ప్రధాని మోదీ గిఫ్ట్ గా ఇచ్చిన బీహార్ స్పెషల్ థేకువా..మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
బుధాదిత్య యోగం: ఈ రాశుల వారికి జూన్ 22 వరకు తిరుగేలేదు, భారీ లాభాలు ఖాయం! -
ఆ పురాతన దేవాలయంలో 500 సంవత్సరాలుగా ఒకే పొయ్యి మీద వండుతున్న ప్రసాదం
వేల డాలర్లు పెట్టి కోట్ల మంది కొనే దుబాయ్ ఫేమస్ 'కునాఫా చాక్లెట్'..ఈ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
చాక్లెట్ అంటే ఇష్టపడనివాళ్లు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ఫారిన్ చాక్లెట్స్ అంటే ఎగబడి తింటుంటారు కొందరు. అయితే దుబాయ్ ఫేమస్ అయిన కునాఫా చాక్లెట్ ని మీరెప్పుడైనా తిన్నారా? ఓ సారి తప్పక టేస్ట్ చేయాల్సిన చాక్లెట్ ఇది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దుబాయ్ లోనే కాకుండా చాలా మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా ఈ చాక్లెట్ ఫేమస్. వేల డాలర్లు పెట్టి ఈ చాక్లెట్ ను కొంటారు. ఈ ఖరీదైన చాక్లెట్ ను మీ ఇంట్లోనే మీరు సులభంగా తయారుచేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.
కునాఫా చాక్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఆయిల్ బేస్ట్ గ్రీన్ కలర్
-ఆయిల్ బేస్ట్ ఎల్లో కలర్
-వైట్ చాక్లెట్
-చాక్లెట్ మౌల్డ్స్
-పిస్తా
-నువ్వులు
-ఆయిల్
-పాలు
-చక్కెర
-ఉప్పు
-డార్క్ చాక్లెట్ కాంపౌండ్
-వైట్ చాక్లెట్ కాంపౌండ్
-వెన్నిలా ఎసెన్స్
-కునాఫా స్పెషల్ సేమియా

కునాఫా చాక్లెట్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఓ గిన్నెలో పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయాలి. ఈ గిన్నె మీదనే ఓ బౌల్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల సన్నగా తరగుక్కున్న వైట్ చాక్లెట్ వేసి కరిగించాలి.
-కరిగించిన వైట్ చాక్లెట్ మిశ్రమాన్ని రెండు గిన్నెల్లోకి సగం సగంగా తీసుకోండి. ఒక గిన్నెలోని చాక్లెట్ మిశ్రమంలో ఆయిల్ బేస్ట్ గ్రీన్ కలర్..ఇంకో గిన్నెలో ఆయిల్ బేస్డ్ పసుపు కలర్ వేసుకొని కలపాలి.
-తర్వాత చాక్లెట్ మౌల్డ్స్ తీసుకొని అందులో కలిపి ఉంచిన ఈ పసుపు, గ్రీన్ కలర్ మిశ్రమాన్ని చల్లినట్లుగా వేసి 10 నిమిషాలు ఫ్రిడ్జ్ లో పెట్టయాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 50 గ్రాముల పిస్తా వేసి తక్కువమంట మీద లైట్ గా దోరగా వేయించి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే నీళ్లు వేడి చేసి ఇందులో వేయించిన పిస్తా వేసి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఈ పిస్తాని ఈ నీళ్లలో వేసి కొంచెం బాయిల్ అయ్యాక స్టవ్ మీదనుంచి దించేయాలి.
-ఇప్పుడు పిస్తాని చల్లటి నీళ్లలో వేసి పిస్తా పైన ఉండే తొక్కను తీసేయాలి.
వంకాయ పల్లికారం..ఇలా చేశారంటే మీ ఆయన మీ చుట్టూ తిరగాల్సిందే,పిల్లలకు కూడా నచ్చుతుంది
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి దోరగా చిటపటలాడేదాకా వేయించిన తర్వాత దీనిని మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి మెత్తగా ఫైన్ గా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులోనే తొక్క తీసేసి పక్కన ఉంచిన పిస్తా, కొద్దిగా ఆయిల్ వేసి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు, 1 టేబుల్ స్పూన్ వెన్నిలా ఎసెన్స్ వేసి వీలైనంత మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 50 గ్రాముల కునాఫా స్పెషల్ సేమియాని క్రష్ చేసి వెయ్యాలి. చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కనపెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత ఓ బౌల్ గ్రైండ్ చేసిన పిస్తా మిశ్రమాన్ని,వేయించిన సేమియాని వేసి బాగా కలపాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నెలో వాటర్ పోసి ఈ గిన్నె మీద మరో బౌల్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల తరగిన డార్క్ చాక్లెట్ కాంపౌండ్, 2 టేబుల్ స్పూన్ల వైట్ చాక్లెట్ కాంపౌండ్ వేసి కరిగించాలి. తర్వాత దీనిని ముందుగా ఫ్రిడ్జ్ లో ఉంచిన చాక్లెట్ మౌల్స్ లో గ్యాప్స్ లేకుండా ఓ లేయర్ గా పర్చుకోవాలి.
-తర్వాత ఈ చాక్లెట్ మౌల్డ్స్ ని ఫ్రిడ్జ్ లో 10 నిమిషాలు పెట్టాలి.
-తర్వాత దానిని బయటకు తీసి అందులో కలిపి ఉంచిన పిస్తా,సేమియా పేస్ట్ ని వేసి,దీని చుట్టూ.. పైన కరిగించిన చాక్లెట్ మిశ్రమాన్ని వేసుకోవాలి. చాక్లెట్ మిశ్రమంతో చాక్లెట్ మౌల్డ్ ని కవర్ చేయాలి. దీనిని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత బయటకు తీసి చాక్టెట్ మౌల్డ్ లో నుంచి నెమ్మదిగా చాక్లెట్ ను బయటకు తీయాలి. అంతే దుబాయ్ ఫేమస్ కునాఫా చాక్లెట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications