Latest Updates
-
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది!
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 2026లో భాగంగా 3 వ రోజున(అక్టోబర్ 13)న అమ్మవారిని శ్రీ అన్నపూర్ణావేవి రూపంలో అలంకరించి కొలుస్తారు. లోకంలోని జీవులన్నింటికీ ఆకలి తీర్చి, పోషణ కల్పించే జగన్మాతగా అన్నపూర్ణాదేవిని కొలుస్తారు. అలాంటి అమ్మకు నైవేద్యంగా కొబ్బరి పాయసం చేయండి.
లోకానికే అన్నం పెట్టే ఆ అన్నపూర్ణా దేవి తల్లికి.. స్వచ్ఛమైన పాలు, కొబ్బరి, నెయ్యితో చేసిన మధురమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే, ఆ తల్లి ఎంతో సంతోషించి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నైవేద్యంగా సమర్పించడానికి, ఎంతో రుచికరమైన,నోట్లో వేసుకోగానే కరిగిపోయే కొబ్బరి పాయసాన్ని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పచ్చి కొబ్బరికాయ - 1
చిక్కటి పాలు - తగినన్ని
పంచదార - రుచికి సరిపడా
కుంకుమపువ్వు - కొద్దిగా
నెయ్యి - కొద్దిగా
డ్రై ఫ్రూట్స్- జీడిపప్పు, బాదం, కిస్మిస్
యాలకుల పొడి - కొద్దిగా
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి?
తయారీ విధానం
-ముందుగా ఒక తాజా పచ్చి కొబ్బరికాయను తీసుకుని రెండుగా పగలగొట్టాలి. పెంకు నుంచి కొబ్బరిని జాగ్రత్తగా బయటకు తీసి, దానికి అడుగున ఉన్న బ్రౌన్ రంగు పొరను పూర్తిగా చెక్కు తీసేయాలి. ఆ తర్వాత ఆ తెల్లటి కొబ్బరిని నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలి.
-ఇప్పుడు ఆ కొబ్బరిని ఒక తురుము పీట లేదా గ్రేటర్ సహాయంతో చాలా సన్నగా తురుముకోవాలి. కొబ్బరి తురుము ఎంత సన్నగా ఉంటే పాయసం అంత అద్భుతమైన రుచిని ఇస్తుంది.
-తర్వాత ఒక మందపాటి గిన్నెలో లేదా కెటిల్ లో చిక్కటి పాలు పోసి బాగా మరిగించాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత సన్నని మంటపై, పాలు సగం పరిమాణానికి తగ్గేలా నిదానంగా మరిగించాలి. ఇలా నెమ్మదిగా మరిగించడం వల్లే పాయసానికి అద్భుతమైన క్రీమీ టెక్స్చర్ వస్తుంది.
-పాలు బాగా చిక్కబడి సగానికి తగ్గాక, ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేయాలి. పాయసం చిక్కగా, క్రీమీగా మారేంతవరకు కనీసం 7 నుంచి 8 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. ఈ సమయంలో కొబ్బరి పాలలోని కమ్మదనాన్ని పీల్చుకుని మరింత రుచిగా మారుతుంది.
-పాయసం ఉడుకుతున్నప్పుడు అందులో మీ తీపికి తగినంత చక్కెర వేసుకోవాలి. అలాగే ముందుగా కుంకుమపువ్వు నానబెట్టుకున్న పాలను, నేతిలో దోరగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి. కుంకుమపువ్వు వల్ల పాయసానికి మంచి రాయల్ లుక్ వస్తుంది.
-చివరగా పాయసంలో కొద్దిగా యాలకుల పొడి చల్లి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, కొబ్బరి పాయసం రెడీ. దసరా సమయంలో ఉపవాసాలు ఉండే భక్తులకు కూడా ఈ పాయసం తక్షణ శక్తిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
