Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
Miriyala pulusu: ఆరోగ్యానికి మేలు చేసే ఘాటైన మిరియాల పులుసు.. ఇలా చేసుకొని తింటే, వేళ్ళు కూడా నాకేస్తారు!
మిరియాలు చాలా ఘాటైన మసాలా దినుసుల్లో ఒకటి. మిరియాలు తింటే నషాళానికి ఎక్కేసే ఘాటు ఉంటుంది. డబ్బు, జలుబు చేసిన వారు మిరియాల పులుసును ఎక్కువగా తింటూ ఉంటారు. మిరియాలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మిరియాలతో చేసే ఘాటైన పులుసు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ప్రత్యేకమైనది, అత్యంత రుచికరమైన పులుసుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఈ పులుసును ఎలా చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిరియాల పులుసు కోసం కావాల్సిన పదార్థాలు
ఈ మిరియాల పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా మిరియాల పేస్ట్ తయారు చేసుకోవాలి. అలాగే సపరేట్‌గా పులుసును సిద్ధం చేసుకోవాలి. ముందుగా మిరియాల పేస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం..

- ఒక టీస్పూన్ నూనె
- రెండు టేబుల్ స్పూన్ ధనియాలు
- ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు
- ఒక టేబుల్ స్పూన్ బియ్యం
- మూడు టేబుల్ స్పూన్ల మిరియాలు
- రెండు వెల్లుల్లి రెబ్బలు
- కొద్దిగా కరివేపాకు
- అయిదు ఎండు మిరపకాయలు
- కొద్దిగా నీరు
పులుసు కోసం కావాల్సిన పదార్థాలు
- చిన్న ముక్క చింతపండు
- నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె
- ఒక టీస్పూన్ ఆవాలు
- అర టీస్పూన్ మెంతులు
- ఒక టీస్పూన్ జీలకర్ర
- పావు టీస్పూన్ ఇంగువ
- సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ
- రెండు వెల్లుల్లి రెబ్బలు
- కొద్దిగా కరివేపాకు
- చిటికెడు పసుపు
- రుచికి తగినంత ఉప్పు
- ఒక టీస్పూన్ బెల్లం
- అవసరమైనంత నీరు
మిరియాల పులుసు తయారీ విధానం
ఈ పులుసు తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో ధనియాలు, పచ్చి శనగపప్పు, బియ్యం, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తరువాత వాయిని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. అవి చల్లారిన తరువాత మిక్సీ గిన్నెలో వేసుకొని, కొంచెం నీరు పోసుకొని బాగా మెత్తగా రుబ్బుకొని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
అలాగే చింతపండును నానబెట్టి అందులోని గుజ్జు తీసేసి రసాన్ని పిండుకోవాలి. అటు ఇంకో పాత్ర తీసుకొని అందులో నువ్వుల నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడయ్యాక అందులో మినపప్పు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, చిన్న ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక అందులో చింతపండు పులుసు, కొంచెం పసుపు, గల్లప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు బాగా మరిగే వరకు వేడి చేసుకోవాలి.
పులుసు బాగా మరిగాక.. ముందుగా చేసి పెట్టుకున్న మిరియాల పేస్ట్‌ను ఆ పులుసులో పోసుకొని కలుపుకోవాలి. ఈ పులుసులో నీరు సరిపడా లేకపోతే నీళ్లు కలుపుకోవాలి. అలాగే బెల్లం ముక్క కూడా వేసుకోవాలి. దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. అనంతరం మూత పెట్టి ఓసారి మరిగించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఘాటైన మిరియాల పులుసు సిద్ధమైపోయినట్లే. దీనిని అన్నంతో కలుపుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
