Latest Updates
-
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే.. -
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.!
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
తెలుగు వారి ఇళ్లలో బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం పూట స్నాక్స్ గా వడలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వడలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మినప వడలు. అయితే మినప వడల కంటే కూడా ఎంతో సులభంగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే మరో అద్భుతమైన వంటకం పెసరపప్పు వడ. వేడి వేడి టీ తో పాటు కరకరలాడే పెసర వడలను తింటుంటే ఆ మజాయే వేరు.
పెసరపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎంతో మంచిది. మిగతా పప్పులతో పోలిస్తే పెసరపప్పు పొట్టకు చాలా తేలికగా ఉంటుంది, గ్యాస్ సమస్యలు రావు. ఇందులో ఐరన్, పొటాషియం, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలా రుచిగా, కరకరలాడే సెసరపప్పు వడలు మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పెసరపప్పు వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-బియ్యం పిండి
-పెసరపప్పు
-జీలకర్ర
-కరివేపాకు
-కొత్తిమీర
-నూనె
-వెల్లుల్లి రెబ్బలు
-ఉల్లిపాయ
-పసుపు
-ఉప్పు
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా!
పెసరపప్పు వడలు తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో ఒక కప్పు(200గ్రా) పెసరపప్పు వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగాక, నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి.
-2 గంటల తర్వాత అందులో ఉన్న నీటిని మొత్తం వంపేసి పప్పును తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో పొట్టు తీసేసిన 4 వెల్లుల్లి రెబ్బలు, అర టీస్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు 2 పచ్చిమిరపకాయలు, 3 ఎండు మిరపకాయలు వేసి వీటన్నింటిని గ్రైండ్ చేసుకోండి.
-గ్రైండ్ చేసుకున్న మిశ్రయాన్ని బయటకు తీయవద్దు. అందులోనే నీళ్లు వంపేసిన పెసరపప్పు మొత్తం కాకుండా పిడికెడు పప్పు పక్కన పెట్టి మిగతాది మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేయాలి.
-గ్రైండ్ చేసిన మొత్తం మిశ్రమాన్ని పక్కన ఉంచుకున్న పిడికెడు పెసరపప్పలో వేసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయల తరుగు, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, సన్నగా తరిగిన పిడికెడు కొత్తిమీర, పావు టీస్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చెయ్యాలి.
-వేడెక్కిన నూనెలో.. కొంచెం కొంచెంగా కలిపిన పిండిని చేతిలోకి తీసుకొని దాన్ని వడల్లా ఒత్తి వేయండి. వడలు మంచి రంగులోకి వచ్చి, పైన క్రిస్పీగా మారేదాకా మీడియం మంట మీద వేయించి తర్వాత బయటకు తీసుకోవాలి.
-అంతే టేస్టీ పెసరపప్పు వడలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
