ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

మనలో చాలామంది సాయంత్రం పూట స్నాక్ గా ఎక్కువగా బోండా,బజ్జీలు, వడలు వంటివి తింటుంటాం. అయితే ఓ సారి వీటిని పక్కన పెట్టి ఇంట్లోనే చీజీ గార్లిక్ బ్రెడ్ ట్రై చేసి చూడండి. బ్రెడ్ పైన కరిగిన చీజ్, వెల్లుల్లి సువాసనతో నోరూరించే ఈ రెసిపీని మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ టీ టైమ్ స్నాక్స్ గానీ, పార్టీల సమయంలో స్టార్టర్ గానీ ఇది అద్భుతంగా ఉంటుంది.

చీజ్ సాగుతూ, వెల్లుల్లి ఫ్లేవర్‌ తో ఉండే దీనిని వేడివేడిగా తింటే ఆ మజాయే వేరు. దీనిని చూస్తేనే ఎప్పుడెప్పుడు నోట్లో పడుతుందా అని అనిపిస్తుంటది. చీజీ గార్లిక్ బ్రెడ్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Extra Cheesy Garlic Bread Recipe in Telugu Best Starter and Tea Time snack

కావలసిన పదార్థాలు

బ్రెడ్ పిండి కోసం
మైదా పిండి - ఒకటిన్నర కప్పులు (సుమారు 190 గ్రాములు)
ఇన్‌ స్టంట్ డ్రై ఈస్ట్ - 1 టీస్పూన్
చక్కెర - 1 టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
ఆలివ్ ఆయిల్ - 2 టీస్పూన్లు
గోరువెచ్చని నీళ్లు - అర కప్పు, 2 టేబుల్ స్పూన్లు పిండి కలుపుకోవడానికి
గార్లిక్ బటర్ కోసం
వెల్లుల్లి రెబ్బలు - 25 నుండి 30 వరకు
ఆలివ్ ఆయిల్ - 3 నుండి 4 టేబుల్ స్పూన్లు
వెన్న - 40 గ్రాములు
చిల్లీ ఫ్లేక్స్- 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
చీజ్ టాపింగ్ కోసం
తురిమిన మోజారెల్లా చీజ్ - 150 నుండి 200 గ్రాములు

ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్‌ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో మైదా పిండి, ఇన్‌ స్టంట్ డ్రై ఈస్ట్, చక్కెర, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో నూనె వేసి, కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లను పోస్తూ పిండిని సాఫ్ట్‌ గా కలుపుకోవాలి.

-కలుపుకున్న పిండిని కనీసం 8 నుండి 10 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేయాలి. ఆ తర్వాత పిండిపై మూత లేదా తడి గుడ్డని ఉంచి, దాని పరిమాణం రెట్టింపు అయ్యే వరకు ఒక వెచ్చని ప్రదేశంలో పక్కన పెట్టుకోవాలి.

-పిండి నానుతున్న సమయంలో, స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి, అవి మెత్తగా,లేత బంగారు రంగులోకి మారే వరకు నెమ్మదిగా వేయించాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని బాగా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్‌ లో మెత్తటి వెన్న, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఘుమఘుమలాడే గార్లిక్ బటర్ రెడీ.

-రెట్టింపు పరిమాణానికి చేరుకున్న పిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి పిసికి, రెండు సమాన భాగాలుగా విభజించుకోవాలి. ప్రతి భాగాన్ని పొడవాటి దీర్ఘచతురస్రం లేదా గుడ్డు ఆకారంలో రోలర్ సహాయంతో కాస్త మందంగా ఒత్తుకోవాలి.

-ఇప్పుడు ఒత్తుకున్న పిండి పైన సిద్ధం చేసుకున్న గార్లిక్ బటర్‌ ను ఒక మందపాటి పొరలా అన్ని వైపులా సమానంగా రాయాలి. ఆ తర్వాత దానిపైన తురిమిన మోజారెల్లా చీజ్‌ ను ఎక్కువగా చల్లుకోవాలి.

-ఓవెన్‌ ను ముందుగానే 180°C ఉష్ణోగ్రత వద్ద ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్‌ ను ఓవెన్‌ లో ఉంచి 15 నుండి 20 నిమిషాల పాటు బేక్ చేయాలి. బ్రెడ్ అంచులు లేత బంగారు రంగులోకి మారి, పైన వేసిన చీజ్ పూర్తిగా కరిగి అద్భుతంగా కనిపించే వరకు ఉంచాలి.

-బేక్ అయిన గార్లిక్ బ్రెడ్‌ ను బయటకు తీసి, వేడిగా ఉన్నప్పుడే కత్తితో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన చీజీ గార్లిక్ బ్రెడ్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, September 17, 2026, 20:35 [IST]
Desktop Bottom Promotion