Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇడ్లీనే. కానీ రోజూ ఒకేరకమైన ఇడ్లీ తింటే ఒక్కోసారి బోర్ కొట్టేస్తుంది. దానికి కాస్త ఆరోగ్యాన్ని, అద్భుతమైన రుచిని జోడిస్తూ సరికొత్తగా సొరకాయ మునగాకు ఇడ్లీ ట్రై చేయండి.
ఫైబర్ తో నిండిన సొరకాయ, పోషకాల గనిగా పిలిచే మునగాకు.. ఈ రెండింటి కాంబినేషన్ లో రవ్వ, పెరుగుతో చేసే ఈ ఇడ్లీలు ఉదయం పూట పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లల డైట్ లో వాటిని సులభంగా చేర్చడానికి ఇదొక బెస్ట్ ట్రిక్.

సొరకాయ మునగాకు ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
సొరకాయ తురుము - 1 కప్పు
మునగాకు - కొద్దిగా
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - 1 కప్పు
పెరుగు - అర కప్పు
అల్లం తురుము - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
పోపు కోసం
నూనె - 1 టీస్పూన్
ఆవాలు, జీలకర్ర - 1 టీస్పూన్
కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - కొద్దిగా
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా..
సొరకాయ మునగాకు ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సొరకాయ తురుము, సన్నగా తరిగిన మునగాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, పచ్చి కొబ్బరి తురుము వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. సొరకాయలో నీటి శాతం ఉంటుంది కాబట్టి చూసుకుని కొద్దిగా నీళ్లు యాడ్ చేయాలి.
-ఇప్పుడు ఆ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి సాధారణ ఇడ్లీ పిండిలా కలుపుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-ఇడ్లీకి మరింత రుచి కావాలనుకుంటే చిన్న పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి.. ఆ పోపును పిండిలో కలుపుకోవాలి.
-ఇడ్లీ పాత్ర తీసుకుని, ప్లేట్లకు నూనె రాయడానికి బదులుగా ఇడ్లీ గుంటల సైజులో కత్తిరించిన అరటి ఆకు ముక్కలను ఉంచండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని ఆ అరటి ఆకులపై ఇడ్లీల్లా వేసుకోవాలి.
-ఇడ్లీ పాత్రను మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం మంట మీద ఆవిరిపై ఉడికించాలి.
-అంతే వేడివేడిగా, కమ్మని వాసనతో కూడిన సొరకాయ మునగాకు ఇడ్లీ రెడీ. అరటి ఆకులో ఉడకడం వల్ల ఇవి ఎంతో మృదువుగా, ఆరోగ్యకరంగా ఉంటాయి.
-మీకు నచ్చిన పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో వీటిని సర్వ్ చేస్తే.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
