Latest Updates
-
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ! -
శవాల ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా? గరుడ పురాణం ఏం చెబుతోంది? -
ఆరోగ్యానికి మేలు చేసే మునగకాయ పచ్చడి ..ఇలా చేస్తే ఏడాది అయినా అస్సలు పాడవదు! -
అక్టోబర్ 11న చిత్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశుల వారు జర భద్రం! -
బిర్యానీ కూడా దీని ముందు బలాదూర్.. తెలంగాణ స్టైల్ బగారా రైస్, పనీర్ కర్రీ ఇలా చేసి తింటుంటే స్వర్గమే! -
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ!
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది!
మనం రోజూ తినే భోజనంలో ఎప్పుడూ ఒకే రకమైన రుచులు ఉంటే కాస్త విసుగు రావడం కామన్. ఏదైనా కొత్తగా, నోటికి పుల్లపుల్లగా, కరకరలాడుతూ తగిలితే ఆ మజాయే వేరు. అలాంటి అద్భుతమైన అనుభూతిని ఇచ్చేదే టర్కిష్ టొమాటో ఉల్లిపాయ సలాడ్.
టర్కిష్ వంటకాలు వాటి తాజాదనానికి, ఆరోగ్యకరమైన పదార్థాలకు ఎంతో ప్రసిద్ధి. రసభరితమైన టొమాటోలు, ఘాటైన ఉల్లిపాయల కలయికతో క్షణాల్లో తయారయ్యే ఈ సలాడ్ మీ రెగ్యులర్ భోజనానికి ఒక ప్రత్యేకమైన రుచిని జోడిస్తుంది.

టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ తయారీకి కావలసిన పదార్థాలు
తాజా టొమాటోలు - 2
ఎర్ర ఉల్లిపాయలు - 2
తాజా పార్స్లీ ఆకులు (లేదా కొత్తిమీర) - ఒక గుప్పెడు
ఉప్పు - అర టీస్పూన్
సుమాక్ (Sumac) పొడి - 1 టేబుల్ స్పూన్ (ఇది ప్రత్యేకమైన టర్కిష్
మసాలా)
నిమ్మకాయ - సగం
ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ - 2 నుండి 3 టేబుల్
స్పూన్లు
దానిమ్మ మొలాసిస్ (దానిమ్మ సిరప్) - 1 టేబుల్ స్పూన్
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!
టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ తయారీ విధానం
-ముందుగా ఎర్రగా పండిన తాజా టొమాటోలు, ఉల్లిపాయలను తీసుకుని
శుభ్రంగా కడగాలి. వాటిని వీలైనంత సన్నని ముక్కలుగా కట్
చేసుకోవాలి.
అలాగే పార్స్లీ ఆకులను కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
-కట్ చేసిన మూడింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెలో ఆలివ్ ఆయిల్,దానిమ్మ సిరప్ వేయాలి. తర్వాత మీ రుచికి తగినట్లుగా కొద్దిగా ఉప్పు, సుమాక్ పొడిని చల్లుకోవాలి. (ఒకవేళ సుమాక్ దొరకకపోతే కొద్దిగా చాట్ మసాలా వాడవచ్చు).
-చివరగా సగం నిమ్మచెక్కను తీసుకుని ఆ తాజా నిమ్మరసాన్ని సలాడ్ పైన పిండాలి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని, ఈ మసాలాలు, ఆయిల్ కూరగాయల ముక్కలకు బాగా పట్టేలా పైకి కిందకు నెమ్మదిగా కలుపుకోవాలి.
-అంతే టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రెడీ.
-సలాడ్ కలిపిన వెంటనే తినేయకండి. దీనిని 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా విశ్రాంతినివ్వడం వల్ల ఉల్లిపాయ, టొమాటో ముక్కలు నిమ్మరసం, దానిమ్మ సిరప్, మసాలాలను పూర్తిగా పీల్చుకుంటాయి. అప్పుడు అన్ని రుచులు ఒక్కటై సలాడ్ అమృతంలా మారుతుంది.
-ఈ టర్కిష్ సలాడ్..కబాబ్స్, బిర్యానీ, గ్రిల్డ్ చికెన్ లేదా రోటీలతో కలిపి తింటే రుచి అదుర్స్ అనిపించక మానదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
