Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
వంటగదిలో చెమటోడ్చే పనే లేదు.. ఈ ఎండల్లో స్టవ్ వెలిగించకుండా చేసే 4 అద్భుతమైన వంటలివే!
వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలకు తోడు, వంటగదిలో గ్యాస్ పొయ్యి నుంచి వచ్చే వేడిని భరించడం గృహిణులకు అతిపెద్ద సవాలుగా మారుతుంది. చెమటలు కక్కుతూ గంటల తరబడి వంట చేయడం ఎవరికైనా చిరాకు తెప్పిస్తుంది. ఇలాంటి ఎండల్లో స్టవ్ వెలిగించే పనే లేకుండా, గ్యాస్ వృధా చేయకుండా, క్షణాల్లో నోరూరించే చల్లని ఆహారం దొరికితే ఎంత బాగుంటుందో కదా.
అందుకే ఈ రోజుల్లో నో-కుక్ వంటకాలు ట్రెండింగ్ గా మారాయి. ఇవి మీ సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, కడుపుకు హాయిగా అనిపిస్తాయి. శరీరానికి కావాల్సినంత శక్తిని అందిస్తాయి. ఈ వేసవిలో వంటగదిలో చెమటోడ్చకుండా, మీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే కొన్ని విభిన్నమైన, ఆరోగ్యకరమైన రెసిపీలను ఇక్కడ చూడండి.

కడుపుకు చల్లదనాన్నిచ్చే దహీ పోహా తయారీ విధానం
ఒక కప్పు నానబెట్టిన అటుకులు తీసుకుని, అందులో అరకప్పు చల్లటి పెరుగు కలపాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, దోసకాయ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పైన వేయించిన పల్లీలు, దానిమ్మ గింజలతో అలంకరించి తింటే ఆ రుచే వేరు. వేసవి ఉదయాల్లో బ్రేక్ ఫాస్ట్ గా దహీ పోహాను మించిన ఆరోగ్యకరమైన ఆప్షన్ మరొకటి లేదు. ఇది శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.
శక్తినిచ్చే పచ్చి అరటికాయ సలాడ్ తయారీ విధానం
సలాడ్స్ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లేత పచ్చి అరటికాయను తీసుకుని గుండ్రని ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని కొద్దిగా పసుపు వేసి, అందులో ఈ ముక్కలను 15 నిమిషాల పాటు నానబెట్టాక నీటిని వడకట్టేయాలి. తర్వాత ఆ ముక్కలకు క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా జీలకర్ర పొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో వెరైటీగా ఉండే సలాడ్ రెడీ.
మామిడికాయ సాంబార్ తయారీ విధానం
పొయ్యి మీద మరగబెట్టకుండా సాంబార్ చేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? కచ్చితంగా చేయొచ్చు. ఒక మిక్సీ జార్ లో పచ్చి మామిడికాయ తురుము, టమాటా ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. దీనికి తగినన్ని నీళ్లు, ఉప్పు కలిపితే మీ పుల్లపుల్లటి ఇన్స్టంట్ సాంబార్ రెడీ. ఇడ్లీ లేదా దోసెల్లోకి ఈ కమ్మని సాంబార్ అద్భుతంగా ఉంటుంది.
పచ్చి అరటి తొక్క పచ్చడి తయారీ విధానం
లేత పసుపు-ఆకుపచ్చ రంగులో ఉన్న అరటికాయ తొక్కను తీసుకోవాలి. మిక్సీలో ఆ తొక్క ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పలుకులు (చిల్లీ ఫ్లేక్స్), బెల్లం, చింతపండు గుజ్జు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా కొత్తిమీరతో అలంకరిస్తే, కారంకారంగా ఉండే ఈ చట్నీ అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
