For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రూట్ చాట్ రిసిపి తయారీ : వీడియో

Posted By: Lakshmi Perumalla
|

మిక్సడ్ ఫ్రూట్ చాట్ అనే స్నాక్ వంటకం స్ట్రీట్ స్నాక్ గా ప్రసిద్ధి చెందింది. మిక్సడ్ ఫ్రూట్ చాట్ ఇంటిలో సులభంగా మరియు వేగంగా తయారుచేయవచ్చు.

ఈ ఫ్రూట్ చాట్ ఢిల్లీ మరియు పంజాబ్ లలో స్ట్రీట్ స్నాక్ గా ప్రసిద్ధి చెందింది. ఈ ఫ్రూట్ చాట్ రకాల పండ్లను ఉపయోగించవచ్చు. ఈ చాట్ లో అరటి, ఆపిల్, జామ, కివి, పియర్ మరియు దానిమ్మపండులను ఉపయోగించి వాటిపై నిమ్మ రసం, ఉప్పు మరియు చాట్ మసాలా కలుపుతారు.

భారతీయ పండ్ల సలాడ్ తీపి,పులుపు మరియు ఉప్పగా ఉంటుంది. ఈ ఫ్రూట్ చాట్ కూడా అలాగే ఉంటుంది. ఈ ఫ్రూట్ చాట్ తయారీలో రాతి ఉప్పును కూడా ఉపయోగించాలి.

మిక్సడ్ ఫ్రూట్ చాట్ లో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల పిల్లలకు మరియు వృద్దులకు మంచి వంటకం. సాధారణ సలాడ్ బోర్ కొట్టినప్పుడు ఈ ఫ్రూట్ చాట్ ని చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు ఈ చాట్ ను పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా తింటారు.

ఈ ఫ్రూట్ చాట్ ని సిద్ధం చేయటం చాలా సులువుగా మరియు వేగంగా అయ్యిపోతుంది. కాబట్టి వంటగదిలో ఎక్కువ సమయం గడపకుండా ఎక్కువ పోషకాలు ఉన్న ఈ వంటకాన్ని తయారుచేసే విధానం తెలుసుకుందాం.

ఫ్రూట్ చాట్ రిసిపి | ఇండియన్ ఫ్రూట్ సలాడ్ | మిక్స్డ్ ఫ్రూట్ చాట్ | ఈజీ ఫ్రూట్ చాట్ రిసిపి
ఫ్రూట్ చాట్ రిసిపి | ఇండియన్ ఫ్రూట్ సలాడ్ | మిక్స్డ్ ఫ్రూట్ చాట్ | ఈజీ ఫ్రూట్ చాట్ రిసిపి
Prep Time
10 Mins
Cook Time
5M
Total Time
15 Mins

Recipe By: Sowmya Shekar

Recipe Type: Snacks

Serves: 4

Ingredients
  • అరటి పండ్లు - 2

    ఆపిల్ పండు - 1

    జామ కాయ - 1

    దానిమ్మ పండు - పండులో సగం

    కివి - 1

    పియర్ - 1

    నిమ్మరసం - 4 స్పూన్స్

    రాతి ఉప్పు - రుచికి సరిపడా

    చాట్ మసాలా - ½ స్పూన్

How to Prepare
  • 1. అరటి పండు తొక్క తీసి గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి.

    2. ఆపిల్ ని సగానికి కట్ చేసి గింజలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

    3. జామ కాయ పై భాగం, కింద భాగం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

    4. దానిమ్మ పండు తొక్క తీసేసి సగం దానిమ్మ పండు గింజలను ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

    5. కివి పై తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

    6. పియర్ పై భాగం, కింద భాగం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

    7. కట్ చేసిన ముక్కలన్నీ ఒక మిక్సింగ్ గిన్నెలో వేయాలి.

    8. ఆ ముక్కలలో నిమ్మరసం కలపాలి.

    9. ఆ తర్వాత రాతి ఉప్పు కలపాలి.

    10. చాట్ మసాలా కలపాలి.

    11. ఫ్రూట్ ముక్కలను బాగా కలిపి సర్వ్ చేయాలి.

Instructions
  • 1. మీకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా ఉపయోగించవచ్చు.
  • 2. కొంచెం స్పైసిగా కావాలంటే ఎర్ర కారం లేదా మిరియాల పొడి కలపవచ్చు.
  • 3. చాట్ రుచిని పెంచటానికి జీలకర్ర పొడిని కలపవచ్చు.
  • 4. రాతి ఉప్పుకు బదులుగా సాధారణ ఉప్పును కూడా ఉపయోగించవచ్చు.
Nutritional Information
  • సర్వింగ్ సైజు - 1 బౌల్
  • కేలరీలు - 120 కేలరీలు
  • కొవ్వు - 0.7 గ్రా
  • ప్రోటీన్ - 1.6 గ్రా
  • కార్బోహైడ్రేట్లు - 24.1 గ్రా
  • ఫైబర్ - 2.7 గ్రా

తయారి విధానం

1. అరటి పండు తొక్క తీసి గుండ్రని ముక్కలుగా కట్ చేయాలి.

2. ఆపిల్ ని సగానికి కట్ చేసి గింజలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

3. జామ కాయ పై భాగం, కింద భాగం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

4. దానిమ్మ పండు తొక్క తీసేసి సగం దానిమ్మ పండు గింజలను ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

5. కివి పై తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

6. పియర్ పై భాగం, కింద భాగం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

7. కట్ చేసిన ముక్కలన్నీ ఒక మిక్సింగ్ గిన్నెలో వేయాలి.

8. ఆ ముక్కలలో నిమ్మరసం కలపాలి

9. ఆ తర్వాత రాతి ఉప్పు కలపాలి.

10. చాట్ మసాలా కలపాలి.

11. ఫ్రూట్ ముక్కలను బాగా కలిపి సర్వ్ చేయాలి.

[ 4.5 of 5 - 97 Users]
English summary

Fruit Chaat Recipe | Indian Fruit Salad | Mixed Fruit Chaat | Easy Fruit Chaat Recipe

Fruit chaat is a popular street food prepared as an evening snack in most parts of the country. Here is a video recipe followed by the step-by-step proced
Desktop Bottom Promotion