Latest Updates
-
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు!
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్‌ఫాస్ట్ రెడీ.!
మార్నింగ్ ఎంత బిజీగా ఉన్నా బ్రేక్‌ఫాస్ట్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. లేదంటే ఒబెసిటీ, నీరసం, బీపీ, డయాబెటిస్ మరింత పెరుగుతాయి. అయితే కొందరు టైం లేదని, టిఫిన్ చేసే టైం లేక బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తారు. కానీ, ఇకపై ఆ పొరపాటు వద్దు. మీకు టిఫిన్ చేసే టైం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇంట్లోనే మ్యాగీ చేసినంత ఈజీగా ఈ రైస్ సేమియా ట్రై చేయండి. మైదా లేకుండా హెల్తీగా ఉండటంతో పాటు ఈజీగా అరుగుదల అవుతుంది. రైస్ సేమియా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం..

రైస్ సేమియా తయారీకి కావాల్సిన పదార్థాలు
రైస్ సేమియా- 150 గ్రాములు
కొత్తిమీర- గుప్పెడు
పచ్చిమిర్చి- రెండు
పచ్చికొబ్బరి- అర కప్పు
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు- రెండు టీస్పూన్లు
జీడిపప్పు- రెండు టేబుల్ స్పూన్లు
పచ్చి బఠాణీలు- పావు కప్పు
కరివేపాకు- రెండు రెబ్బలు
క్యారెట్ తురుము- అర కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
రైస్ సేమియా తయారీ విధానం
రైస్ సేమియా తయారీ కోసం ముందుగా 150 గ్రాములు తీసుకుని నీళ్లు బాగా మరిగించి అందులో సేమియా వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వడగట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి.
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు
స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో నూనె పోసి కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పలుకులు వేసి వేగనివ్వాలి.
ఇప్పుడు పచ్చి బఠాణీలు, క్యారెట్ తురుము, కరివేపాకు వేసి రెండు నిమిషాల పాటు వేయించండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించాలి.
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ సేమియాను వేసి సున్నితంగా కలపాలి. తాలింపు, కొత్తిమీర పేస్ట్ మొత్తం కలిసేలా గరిటెతో కలుపుతూ ఉండాలి. తర్వాత రెండు నిమిషాల పాటు చిన్న మంటపైన ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. పొడిపొడిగా అంటుకోకుండా టేస్టీ రైస్ సేమియా రెడీ.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదా లంచ్‌లోకి ఈ రైస్ సేమియా అద్భుతంగా ఉంటుంది. జీడిపప్పు అందుబాటులో లేకపోతే పల్లీలు కూడా వేసుకుని చేసుకోవచ్చు. మార్నింగ్ కిచెన్‌లో హడావుడిగా ఉన్నప్పుడు ఈ కొత్త రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మైదాతో చేసిన సేమియా కాకుండా ఈ రైస్ సేమియాతో చేసినట్లయితే పొట్ట కూడా తేలికగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
