Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలోకి..అదిరిపోయే కొత్తిమీర చికెన్
సాధారణంగా మనం చికెన్ ఫ్రై లేదా చికెన్ కర్రీ రెగ్యులర్ పద్ధతిలోనే చేస్తుంటాం. ఎప్పుడూ ఒకే రకమైన మసాలాలతో చేసే చికెన్ ఫ్రై తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా ట్రై చేయండి. రొటీన్ ఎరుపు రంగు చికెన్ కాకుండా.. పచ్చగా, కమ్మని సువాసనతో, ఘాటైన రుచితో ఉండే మల్లి చికెన్ రోస్ట్(కొత్తిమీర చికెన్) ట్రై చేయండి.
ముఖ్యంగా ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలోకి సాంబార్ లేదా రసం వేసుకుని, నంచుకోవడానికి ఈ స్పైసీ కొత్తిమీర చికెన్ ఉంటే ఆ మజానే వేరు. రుచికరమైన మల్లి చికెన్ రోస్ట్ ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
చికెన్: 1 కిలో
ఉప్పు: తగినంత
నిమ్మరసం: తగినంత
పసుపు: కొద్దిగా
నూనె: 2 టీస్పూన్లు
అల్లం: 1 అంగుళం
వెల్లుల్లి:4 రెబ్బలు
పచ్చిమిర్చి: 6
ఉల్లిపాయ: సగం ముక్క
జీడిపప్పు:6
కొత్తిమీర: ఒక గుప్పెడు
పుదీనా: 10 ఆకులు
పసుపు: చిటికెడు.
నూనె: 1 టేబుల్ స్పూన్,
పెరుగు: 1 టేబుల్ స్పూన్
నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్
జీలకర్ర: అర స్పూన్
ఎండుమిర్చి: 4
జీడిపప్పు :8
కరివేపాకు: ఒక రెమ్మ
జీలకర్ర పొడి: 1 స్పూన్
గరం మసాలా : 1 స్పూన్
మిరియాల పొడి:1 స్పూన్
తయారీ విధానం
-ముందుగా చికెన్ ను బాగా కడిగి పెట్టుకోవాలి. దానికి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి.
-స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల నూనె వేడి చేయండి. అందులో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన సగం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. అవి వేగాక జీడిపప్పు వేసి, పచ్చిమిర్చి రంగు మారే వరకు వేయించాలి.
-చివరగా కొత్తిమీర, పుదీనా, పసుపు వేసి కాసేపు వేయించి స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమం చల్లారాక మిక్సీలో మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఒక పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి నానబెట్టుకున్న చికెన్, ఒక స్పూన్ పెరుగు, కొద్దిగా పసుపు వేయాలి. చికెన్ నుండి నీరు బయటకు వచ్చి, అది ఇగిరిపోయే వరకు సుమారు 5-10 నిమిషాలు వేయించాలి.
-అదే పాన్ లో మరో 1.5 టేబుల్ స్పూన్ల నూనె పోసి వేడి చేయండి. జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చేలా వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి, వెంటనే మనం రుబ్బుకున్న కొత్తిమీర పేస్ట్, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మసాలా మాడిపోకుండా కొద్దిగా నీరు చల్లి, మీడియం మంటపై వేయించాలి.
-చికెన్ బాగా వేగి మసాలా అంతా ముక్కలకు పట్టి, పచ్చి వాసన పోయి మంచి రంగులోకి మారుతుంది. నూనె పైకి తేలుతున్నప్పుడు ఘాటు కోసం మిరియాల పొడి చల్లి, చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని బాగా కలిపి స్టవ్ ఆపేయండి.
-అంతే గుమగుమలాడే మల్లి చికెన్ రోస్ట్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications



