Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ ఇడ్లీ లేదా దోశ. రోజూ అవే తిని బోర్ కొట్టిందా? రొటీన్ కు భిన్నంగా ఏదైనా కొత్తగా, రుచికరంగా తినాలనిపిస్తే ఎంతో ఆరోగ్యకరమైన, కమ్మనైన గోధుమ రవ్వ కిచిడీ ట్రై చేయండి.
గోధుమ రవ్వలో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉంటుంది. ఇది రోజంతా మీకు కావాల్సిన శక్తిని ఇస్తుంది. దీనికి తోడు మీ ఇంట్లో అందుబాటులో ఉండే రంగురంగుల కూరగాయలు, పప్పులు చేర్చడం వల్ల ఇది ఒక సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు ఇవే
నూనె - 1 టేబుల్ స్పూన్
నెయ్యి - 1 టీస్పూన్ (తాలింపు కోసం) + 1 టీస్పూన్ (చివర్లో
కలపడానికి)
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 1
అల్లం తరుగు - 1 టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
ఎండు మిరపకాయ - 1
జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
టమోటా - 1 (సన్నగా తరిగినది)
పసుపు - 1/4 టీస్పూన్
కారం - 3/4 టీస్పూన్
గరం మసాలా - 1/4 టీస్పూన్
పచ్చి బఠానీలు - 1/4 కప్పు
బీన్స్ - 5 (సన్నగా తరిగినవి)
క్యారెట్ - 1 (ముక్కలుగా తరిగినది)
బంగాళాదుంప - 1 (ముక్కలుగా తరిగినది)
ఉప్పు - రుచికి సరిపడా
గోధుమ రవ్వ - 1/2 కప్పు
పెసర పప్పు లేదా కంది పప్పు - 1/4 కప్పు (నానబెట్టుకోవాలి)
నీరు - 2 1/2 కప్పులు
కొత్తిమీర - కొద్దిగా (గార్నిష్ కోసం)
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. అందులో నూనె, ఒక టీస్పూన్ నెయ్యి వేసి వేడి అయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా దోరగా వేయించాక ఎండుమిర్చి, పసుపు వేసి కలపండి.
-ఉల్లిపాయలు మగ్గాక సన్నగా తరిగిన టమోటా ముక్కలు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి టమోటాలు మెత్తబడేవరకు బాగా వేయించండి.
-ఇప్పుడు పచ్చి బఠానీలు, క్యారెట్, బీన్స్, బంగాళాదుంప ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మీడియం మంట మీద ఒక రెండు నిమిషాల పాటు వేయించండి.
-కూరగాయలు కొద్దిగా మగ్గాక, గోధుమ రవ్వను వేసి మరో నిమిషం పాటు సన్నని మంటపై వేయించండి. ఇలా చేయడం వల్ల కిచిడీ ముద్దగా కాకుండా పొడిపొడిగా వస్తుంది.
-ముందుగా కడిగి నానబెట్టుకున్న పప్పును ఇందులో వేసి కలపండి. ఇప్పుడు రెండున్నర కప్పుల నీరు పోసి బాగా కలపండి. ఉప్పు సరిచూసుకుని, కుక్కర్ మూతపెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.
-కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తెరవండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను పైన చల్లండి. ఒక టీస్పూన్ స్వచ్ఛమైన నెయ్యి వేసి బాగా కలపండి. అంతే గోధుమ రవ్వ కిచిడీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications