Latest Updates
-
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.!
గోంగూర వంటకాలు అంటే ఇష్టపడని తెలుగు వారుండరు. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు కూర, గోంగూర చికెన్ ఇలా ఎన్నో రకాల వెజ్, నాన్ వెజ్ వెరైటీలు మన కిచెన్‌లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. మరి ఎప్పుడైనా గోంగూరతో కోడిగుడ్ల కాంబినేషన్ ట్రై చేశారా. ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చేశాక.. ఇన్నాళ్లు ఇంత మంచి రుచి ఎలా మిస్ అయ్యాం అనుకుంటారు. ఇక, జొన్న రొట్టెలు, వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర గుడ్ల కూర అద్భుతం అంటే నమ్మండి. ఈ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం..

గోంగూర గుడ్డు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు
కోడి గుడ్లు- పది
పుల్లటి గోంగూర కట్టలు- 3
కరివేపాకు- మూడు రెబ్బలు
ఉల్లిపాయలు- మూడు
పచ్చిమిర్చి- 8
నూనె- మూడున్నర టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
కారం- టేబుల్ స్పూన్
పసుపు- అర టీస్పూన్
జీలకర్ర- టీస్పూన్
మెంతులు- పావు టీస్పూన్
ఆవాలు- టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- టీస్పూన్
ధనియాల పొడి- టీస్పూన్
గోంగూర గుడ్డు కూర తయారీ విధానం
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!
ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకోవాలి. అవి ఉడికేలోపు గోంగూర ఆకులను ఒలిచి మట్టి లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకోండి.
తర్వాత ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చిని రెండేసి ముక్కలుగా కట్ చేసుకోండి. కోడిగుడ్లు ఉడికిన తర్వాత పొట్టు తీసి కడిగి పెట్టుకోండి. కోడిగుడ్లను గాటు చేసి ఉంచండి.

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసి గోంగూర వేసి మగ్గనివ్వాలి. గోంగూరు ఉడుకుతున్నప్పుడు పచ్చిమిర్చి వేసి ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఈ గ్రేవీని పక్కన పెట్టుకోండి.
అదే కడాయిలో కొంచెం నూనె పోసి ఉప్పు, కారం, పసుపు వేసి వెంటనే గాటు వేసిన కోడిగుడ్లను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోండి. వీటిని పక్కన ప్లేట్లో ఉంచండి.
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.!
మళ్లీ కడాయిలో మిగిలిన నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి.
ఉల్లిపాయ వేగిన తర్వాత కారం, ధనియాల పొడి వేసి కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసి మగ్గించుకోండి. అడుగంటుతున్నప్పుడు కొన్ని నీళ్లు పోసి కలపండి. కొంచెం ఉడికిన తర్వాత వేయించిన గుడ్లు వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించండి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రుచికరమైన గోంగూర గుడ్ల కూర రెడీ. జొన్న రొట్టెలు, వేడిగా అన్నంలోకి ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
