రెస్టారెంట్‌ స్టైల్‌ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.!

ఉప్మా అంటే చాలా మంది ముఖం చాటేస్తారు. పొద్దున్నే టిఫిన్స్‌లోకి టైం లేనప్పుడు త్వరగా చేయగలిగే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇదే. కానీ పిల్లల నుంచి పెద్దల వరకు కొందరు టిఫిన్‌లోకి ఉప్మా అనగానే వద్దు బాబోయ్‌ అని అలక పూనడం చాలా ఇళ్లలో అనుభవమే. కానీ ఉప్మాను చేసే విధంగా చేస్తే ఇప్పటివరకూ వద్దు అన్నవాళ్లు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారు. అదే వెజిటబుల్ రవ్వ ఉప్మా ఈ ఒక్క చిట్కా పాటిస్తూ ఇందులో కొన్ని యాడ్‌ చేస్తూ ఈ పద్ధతిలో చేశారంటే ఇక ఇప్పటినుంచీ ఉప్మాకి పేరు పెట్టకుండా ఆవురారుమంటూ తినేస్తారు. మరి ఉప్మాను అంత టేస్టీగా, హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం..

Restaurant style Vegetable rava upma with these techniques for healthy and tasty breakfast

వెజిటబుల్‌ రవ్వ ఉప్పా తయరీకి కావాల్సిన పదార్థాలు

మీడియం సైజు బొంబాయి రవ్వ- పావు కేజీ
నెయ్యి- నాలుగు టీస్పూన్లు
నూనె- టేబుల్‌ స్పూన్‌
వేరుశనగ- రెండు టీస్పూన్లు
జీడిపప్పులు- ఐదు
పచ్చిశనగపప్పు- టీస్పూన్‌
మినప్పప్పు- టీస్పూన్‌
ఆవాలు- టీస్పూన్‌
జీలకర్ర- టీస్పూన్‌
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- రెండు
అల్లం ముక్క- చిన్నది
కరివేపాకు- రెండు రెబ్బలు
తరిగిన బీన్స్‌- కప్పు
తరిగిన క్యారెట్‌- కప్పు
పచ్చి బఠాణీ- కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
నీళ్లు- 500మి.లీ
పాలు- పావు కప్పు

వెజిటబుల్‌ రవ్వ ఉప్మా తయారీ విధానం

బ్యాచ్‌లర్స్‌ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.!

ఉప్మా రుచికరంగా రావాలంటే మీడియం సైజు బొంబాయి రవ్వ తీసుకోవడం బెటర్‌. స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో టీస్పూన్‌ నెయ్యి వేసి రవ్వను ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన దోరగా వేయించుకోవాలి.

రవ్వ వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి వేరుశనగ, జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి.

Restaurant style Vegetable rava upma with these techniques for healthy and tasty breakfast

ఇప్పుడు అదే పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయ వేసి రంగు మారేవరకు వేయించుకోండి. మధ్యలో కట్‌ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం ముక్కలతో పాటు కరివేపాకు వేసి వేగనివ్వండి.

అందులోనే తరిగిన బీన్స్‌, క్యారెట్‌, పచ్చి బఠాణీ వేసి కలపండి. రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపిన తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు చిన్న మంటపైన వేయించుకోండి.

మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్‌ రైస్‌.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!

ఇవన్నీ వేగిన తర్వాత పావు కేజీ రవ్వకి అర లీటర్‌ నీళ్లు పోసుకోండి. తర్వాత పావు కప్పు కాచిన పాలు పోసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరగనివ్వండి. రెండు నిమిషాల పాటు చిన్న మంటపైన ఎసరు మరిగిన తర్వాత వేయించిన రవ్వను కొద్దికొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి.

ఇలా మొత్తం రవ్వను పోసుకుని కలిపిన తర్వాత మూత పెట్టుకుని చిన్న మంటపైన ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఉప్మా ఉడికిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి, వేయించిన వేరుశనగ, జీడిపప్పులు వేసి ఒకసారి కలిపి 30 సెకన్ల పాటు చిన్న మంటపైన ఉంచి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోండి.

అంతే టేస్టీ వెజిటబుల్‌ రవ్వ ఉప్మా రెడీ. పాలు, కూరగాయలు కలుపుకొంటూ, నీళ్లు తక్కువగా పోసుకోవడం ద్వారా ఈ ఉప్మా రుచి ఎవర్‌గ్రీన్‌ టేస్ట్‌తో వస్తుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, September 17, 2026, 6:48 [IST]
Desktop Bottom Promotion