మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్‌ లివర్‌ ఫ్రై.. బ్యాచ్‌లర్స్‌ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!

మటన్‌ లివర్‌ అంటే నాన్‌ వెజ్‌ ప్రియులు చెవులు కోసేసుకుంటారు. ఇక, గోంగూరతో మటన్‌ కాంబినేషన్‌ అంటే వహ్వా అనాల్సిందే. ఇంట్లో నాన్‌వెజ్‌ ఉంది అంటే ఆకలి ఇంకా ఎక్కువే అవుతుంది. ఇక, మంచింగ్‌ విషయానికొస్తే మటన్‌లో బోటి, లివర్‌కు ప్రత్యేక స్థానం. లివర్‌ అయితే వేరే లెవెల్‌. ఈ లివర్‌ను ఇలా గోంగూరతో కలిపి ట్రై చేయండి. మంచింగ్‌లోకి సూపర్‌గా ఉంటుంది. బ్యాచ్‌లర్స్‌ ఈ రెసిపీని ఈజీగా చేసుకుని స్టఫ్‌లా తినొచ్చు. ఈ గోంగూర మటన్‌ లివర్‌ ఫ్రైని ఎలా తయారుచేయాలో చూద్దాం..

Gongura Mutton Liver Fry perfect for snacking bachelors can make it easily

గోంగూర మటన్‌ లివర్‌ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు

గోంగూర- మూడు కట్టలు(మీడియం సైజ్‌)
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు
ఏలకులు- మూడు
లవంగాలు- నాలుగు
దాల్చిన చెక్క- నాలుగు
జీలకర్ర- పావు టీస్పూన్‌
ఉల్లిపాయలు- రెండు
పచ్చిమిర్చి- పన్నెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- టీస్పూన్‌
మటన్‌ లివర్‌- అర కిలో
మటన్‌ బోన్‌ ముక్కలు- ఐదు లేదా ఆరు
తాజా కొబ్బరి- పావు కప్పు
ఆవాలు- అర టీస్పూన్‌
జీలకర్ర పొడి- టీస్పూన్‌
ధనియాల పొడి- టీస్పూన్‌
పసుపు- పావు టీస్పూన్‌
కారం- ఒకటిన్నర టీస్పూన్‌

గోంగూర మటన్‌ లివర్‌ ఫ్రై కోసం ముందుగా గోంగూర, మటన్‌ లివర్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో నీళ్లు పోసి మరిగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి, గోంగూర వేసి కాసేపు ఉడికించుకోవాలి. నీళ్లను తీసేసి ఉడికిన గోంగూరను పక్కన పెట్టుకోవాలి.

బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే!

ఇప్పుడు స్టవ్‌పైన కడాయి పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దినుసులు వేసి వేగనివ్వండి. తర్వాత చిన్నగా కట్‌ చేసిన ఉల్లిపాయలు, పొడుగ్గా కట్‌ చేసిన పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు నాలుగు లేదా ఐదు మటన్‌ బోన్‌ ముక్కలు వేసి వాటితో పాటు ఉడికించుకోండి.

Gongura Mutton Liver Fry perfect for snacking bachelors can make it easily

తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయే వరకు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మటన్‌ లివర్‌ వేసి నీళ్లు ఇగిరిపోయేవరకు బాగా ఉడికించండి. నీళ్లు ఇంకిపోయాక ముప్పావు కప్పు నీళ్లు పోసి ఉడికించండి.

లివర్‌ ఉడికే లోపు మిక్సీ జార్‌లో తురిమిన కొబ్బరి, ఆవాలు, మూడు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను లివర్‌లో వేసి పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. ఇప్పుడు కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు వేసి మసాలాలు అన్నీ బాగా పట్టేవరకు ఉడకనివ్వండి.

మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.!

తర్వాత గోంగూర పేస్ట్‌ వేసి చిన్న మంటపైన బాగా ఉడికించండి. నూనె పైకి తేలేవరకు ఉడుకుతూ ఉండాలి. చివరిలో కొత్తిమీర వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవడమే. రుచికరమైన గోంగూర మటన్‌ లివర్‌ ఫ్రై రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 19, 2026, 15:05 [IST]
Desktop Bottom Promotion