Latest Updates
-
వారపు రాశి ఫలాలు [29 మార్చి నుండి 04 ఏప్రిల్]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
ఈరోజు రాశి ఫలాలు (29.03.26): ఆదివారం మీ అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి! -
సమ్మర్ స్పెషల్..ఎలాంటి కృత్రిమ రంగులు లేని స్వచ్ఛమైన రాజస్థానీ మట్కా కుల్ఫీ..టేస్ట్ కేక! -
డెలులు డేటింగ్ అంటే ఏంటీ?..డేటింగ్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కొత్త ట్రెండ్ ఇదే! -
బ్రెడ్ లేకుండానే బ్రెడ్ పకోడీ..టీ టైమ్‌లో దీని మజాయే వేరు..జస్ట్ 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
అచ్చం బేకరీ రుచితో.. ఇంట్లోనే శాండ్ విచ్ చేసుకోండిలా..పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా.. -
డెహ్రాడూన్ స్పెషల్ మటన్ భుట్వా..నెక్స్ట్ లెవల్ టేస్ట్! -
పప్పు నానబెట్టే పనే లేదు..మిగిలిపోయిన బ్రెడ్ తో 15 నిమిషాల్లో కరకరలాడే వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
April 2026 Festivals: హనుమాన్ జయంతి నుండి అక్షయ తృతీయ వరకు..ఏప్రిల్ నెల పండుగల పూర్తి జాబితా! -
ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్!
నోటికి రుచి,పొట్టకు హాయి..మిగిలిపోయిన అన్నంతో 10 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా రైస్!
ఉదయం హడావిడిలో వంట చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు.. సులభంగా, అత్యంత రుచికరంగా చేసుకోగలిగే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ పుదీనా రైస్. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని చిటికెలో చేసుకోవచ్చు. ఇది కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాదు, పొట్టకు హాయినిస్తూ జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది.
అయితే చాలామంది ఇళ్లల్లో పుదీనా రైస్ వండితే అన్నం ముద్దగానో, లేక ఆకులు రంగు మారిపోయి నల్లగానో అవుతుంటుంది. కానీ పక్కా కొలతలు పాటిస్తే.. ఘుమఘుమలాడే సువాసనలతో హోటల్ స్టైల్ పుదీనా రైస్ ను మీ ఇంట్లోనే పది నిమిషాల్లో తయారు చేయవచ్చు. పుదీనా, కొత్తిమీర, పచ్చి కొబ్బరి కలయికతో చేసే మసాలా పేస్ట్ ఈ వంటకానికి అసలైన ప్రాణం పోస్తుంది. పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పుదీనా రైస్ తయారీకి కావలసిన పదార్థాలు
-వండిన అన్నం లేదా రైస్
-తాజా పుదీనా ఆకులు
-కొత్తిమీర
-పచ్చి కొబ్బరి తురుము
-పచ్చిమిర్చి
-అల్లం
-వెల్లుల్లి
-నెయ్యి లేదా నూనె
-జీలకర్ర
-కరివేపాకు
-అనాస పువ్వు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-యాలకులు
-జాపత్రి
-జీడిపప్పు
-ఉప్పు
-బంగాళదుంప
-క్యారెట్
-బఠానీలు
-బీన్స్
పుదీనా రైస్ తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో ముప్పావు కప్పు పుదీనా, పావు కప్పు కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని, అందులో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. నెయ్యి వేడెక్కగానే జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, కరివేపాకు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
-ఇప్పుడు ముందుగా రుబ్బి పెట్టుకున్న పుదీనా-కొబ్బరి పేస్ట్‌ను స్టవ్ మీద ఉన్న కుక్కర్ లో వేసి, పచ్చి వాసన పోయే వరకు మీడియం మంట మీద 3-4 నిమిషాల పాటు వేయించాలి. పేస్ట్ వేగగానే.. మీకు ఇష్టమైతే క్యారెట్, బఠానీలు, బంగాళదుంప ముక్కలు వేసి కలుపుకోవాలి.
-ఇప్పుడు కుక్కర్ లో బాస్మతి బియ్యం వాడితే 1 కప్పు బియ్యానికి 1.5
కప్పుల నీళ్లు పోయాలి. అదే సోనా మసూరి వాడితే - 1 కప్పు బియ్యానికి 2
కప్పుల కంటే కొద్దిగా ఎక్కువ నీళ్లు పోయాలి. నీళ్లు పోసి ఎసరు
మరిగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి, నానబెట్టిన బియ్యాన్ని అందులో
వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఉడికించాలి.
అన్నం ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 5 నిమిషాలు ఆగి మూత
తీస్తే గుమగుమలాడే పుదీనా రైస్ రెడీ.
-వేడి వేడి పుదీనా అన్నాన్ని రైతా లేదా బంగాళదుంప కుర్మాతో కలిపి తింటే ఆ రుచే వేరు. లంచ్ బాక్స్ కు ఇది నిజంగా ఒక అద్భుతమైన ఛాయిస్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








