Latest Updates
-
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఎప్పుడూ ఒకేలాంటి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీ టేస్ట్ బడ్స్ కి కొత్త రుచిని పరిచయం చేసే వంటకమే హరియాళీ చికెన్.
పుదీనా, కొత్తిమీరల తాజాదనం, మసాలాల ఘాటు కలగలిపి అద్భుతమైన రుచిని ఇచ్చే ఈ వంటకం చేయడం కూడా చాలా తేలిక. ఇంటికొచ్చిన అతిథులను ఆశ్చర్యపరచాలన్నా, ఫ్యామిలీకి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలన్నా హరియాళీ చికెన్ పర్ఫెక్ట్ ఛాయిస్.

హరియాళీ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు
చికెన్: 500 గ్రాములు
కొత్తిమీర - 1 కప్పు
పుదీనా ఆకులు - అర కప్పు
పచ్చిమిర్చి - 3 లేదా 4
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8 నుండి 10
పెరుగు - అర కప్పు,
నిమ్మరసం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా.
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 2
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
ఉల్లిపాయలు - 2
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్
హరియాళీ చికెన్ తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని ఆకుపచ్చని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-ఒక పెద్ద గిన్నెలోకి చికెన్ ముక్కలను తీసుకోండి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్ లో సగం వేయండి. అలాగే పెరుగు, నిమ్మరసం, పసుపు, తగినంత ఉప్పు వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలపండి. దీనిపై మూతపెట్టి 30 నిమిషాల పాటు పక్కన ఉంచితే ముక్కలు సాఫ్ట్ గా, జ్యూసీగా తయారవుతాయి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ పెట్టి, నూనె లేదా నెయ్యి వేడి చేయండి. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయండి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ను పాన్ లో వేయండి. మంటను కొంచెం పెంచి, చికెన్ లోని నీరంతా ఇగిరిపోయేలా 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించండి.
-ఇప్పుడు చికెన్ లో మిగిలిన సగం గ్రీన్ పేస్ట్ ను వేయండి. దానితో పాటే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి. మంటను తగ్గించి, మూతపెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించండి.
-చివరగా కొద్దిగా గరం మసాలా చల్లి, మరో రెండు నిమిషాలు సన్నని మంటపై ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే హరియాళీ చికెన్ రెడీ. దీన్ని వేడివేడి రోటీ, నాన్, బగారా రైస్ లేదా బిర్యానీతో కలిపి తింటే ఆ మజాయే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
