రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్

Posted By:

వీకెండ్ వస్తే చాలా ఇళ్లల్లోని వంటగదుల్లో నుంచి నాన్ వెజ్ ఘుమఘమలు రావాల్సిందే. చికెన్ తో రకరకాల వంటకాలను ఇప్పటివరకు ట్రై చేసి ఉంటారు. అయితే మీరెప్పుడైనా రాయలసీమ స్టైల్ కారం చికెన్ ఎప్పుడైనా తినారా? ఒక్క సీక్రెట్ పదార్ధాం ఇందులో కలపడం వల్ల టేస్ట్ జబర్దస్ట్ ఉంటుంది.

అన్నంలో కలుపుకుని ఒక్కో ముద్ద అలా తింటుటంటే ఆహా స్వర్గమే అన్నట్లు మైమర్చిపోతారు. ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా ఇది ప్లేట్ లో పెడితే గిన్నె మొత్తం నాకే కావాలి ప్లీజ్ అని బతిమాలతారు. రాయలసీమ స్టైల్ కారం చికెన్ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Rayalaseema Karam Chicken Recipe in Telugu Add This Secret Ingredient for Ultimate Taste

రాయలసీమ కారం చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-చికెన్
-ఎండుమిర్చి
-ధనియాలు
-జీలకర్ర
-వెల్లుల్లి
-ఎండుకొబ్బరి
-లవంగాలు
-యాలకలు
-సోంపు
-పల్లీలు
-దాల్చిన చెక్క
-ఆయిల్
-నెయ్యి
-కొత్తిమీర
-కరివేపాకు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-వెల్లుల్లి పేస్ట్
-నిమ్మరసం
-పసుపు
-ఉప్పు
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ

రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే..

రాయలసీమ కారం చికెన్ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, సోంపు, పల్లీలు, మిరియాలు, ఎండుకొబ్బరి ముక్కలు, లవంగాలు, యాలకలు, వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క వేసి బాగా వేయించి స్టవ్ ఆపేసి వాటిని చల్లారనివ్వాలి. తర్వాత వీటన్నింటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి.

-తర్వాత అరకేజీ బోన్ లెస్ చికెన్ ను శుభ్రంగా కడిగి ఓ గిన్నెలో వేసుకోండి. ఈ చికెన్ ముక్కల్లో..పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, నిమ్మరసం కొంచెం వేసి మొత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా చేత్తో కలుపుకోండి. కొద్దిసేపు దీన్ని అలా వదిలేయండి.

-తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోండి. అందులో ఆయిల్ పోసి వేడయ్యాక అందులో కలిపి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసి చికెన్ లోని నీరు అంతా ఇగిరిపోయి ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో ఆయిల్ తో పాటు 1 స్పూన్ నెయ్యి కూడా వేసి వేడయ్యాక అందులో కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే ముందుగాగ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి తక్కువ మంట మీద బాగా రోస్ట్ చేసుకోవాలి.

-మసాలా మొత్తం డ్రై అయిన తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి ఆయిల్ సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న చికెన్ ముక్కలు అందులో వేసి తక్కువ మంట మీద 7 నిమిషాల దాకా బాగా కలుపుతూ ఉడికించాలి.

-చివరగా అందులో కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి.

-అంతే రాయలసీమ కారం చికెన్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, September 19, 2026, 16:01 [IST]
Desktop Bottom Promotion