Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఎప్పుడూ ఒకేలాంటి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీ టేస్ట్ బడ్స్‌ కి కొత్త రుచిని పరిచయం చేసే వంటకమే హరియాళీ చికెన్.

పుదీనా, కొత్తిమీరల తాజాదనం, మసాలాల ఘాటు కలగలిపి అద్భుతమైన రుచిని ఇచ్చే ఈ వంటకం చేయడం కూడా చాలా తేలిక. ఇంటికొచ్చిన అతిథులను ఆశ్చర్యపరచాలన్నా, ఫ్యామిలీకి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలన్నా హరియాళీ చికెన్ పర్ఫెక్ట్ ఛాయిస్.

Hariyali Chicken Recipe in Telugu 2026 Spicy Green Chicken Curry

హరియాళీ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్: 500 గ్రాములు
కొత్తిమీర - 1 కప్పు
పుదీనా ఆకులు - అర కప్పు
పచ్చిమిర్చి - 3 లేదా 4
అల్లం - ఒక అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 8 నుండి 10
పెరుగు - అర కప్పు,
నిమ్మరసం - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా.
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
వేయించిన జీలకర్ర పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు - 1
యాలకులు - 2
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
ఉల్లిపాయలు - 2

రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్

హరియాళీ చికెన్ తయారీ విధానం

-ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని ఆకుపచ్చని పేస్ట్‌ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఒక పెద్ద గిన్నెలోకి చికెన్ ముక్కలను తీసుకోండి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న గ్రీన్ పేస్ట్‌ లో సగం వేయండి. అలాగే పెరుగు, నిమ్మరసం, పసుపు, తగినంత ఉప్పు వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలపండి. దీనిపై మూతపెట్టి 30 నిమిషాల పాటు పక్కన ఉంచితే ముక్కలు సాఫ్ట్ గా, జ్యూసీగా తయారవుతాయి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి పాన్ పెట్టి, నూనె లేదా నెయ్యి వేడి చేయండి. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయండి.

-ఉల్లిపాయలు వేగిన తర్వాత, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ ను పాన్‌ లో వేయండి. మంటను కొంచెం పెంచి, చికెన్‌ లోని నీరంతా ఇగిరిపోయేలా 5 నుంచి 7 నిమిషాల పాటు వేయించండి.

-ఇప్పుడు చికెన్‌ లో మిగిలిన సగం గ్రీన్ పేస్ట్‌ ను వేయండి. దానితో పాటే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలపండి. మంటను తగ్గించి, మూతపెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించండి.

-చివరగా కొద్దిగా గరం మసాలా చల్లి, మరో రెండు నిమిషాలు సన్నని మంటపై ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి.

-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే హరియాళీ చికెన్ రెడీ. దీన్ని వేడివేడి రోటీ, నాన్, బగారా రైస్ లేదా బిర్యానీతో కలిపి తింటే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, September 19, 2026, 20:24 [IST]
Desktop Bottom Promotion