బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి..

Posted By:

సొరకాయతో మీరెప్పుడైనా కలకండ్ స్వీట్ తయారుచేశారా? పండుగలు లేదా ప్రత్యేక సందర్భాలలో మార్కెట్ స్వీట్లకు బదులుగా, మీ చేతులతో చేసిన ఈ ఆరోగ్యకరమైన తీపి వంటకంతో మీ ప్రియమైనవారి మనసు గెలవవచ్చు. మీ ఇంట్లో వాళ్లకి ఇది తినిపిస్తే, బయట స్వీట్లు కొనడం పూర్తిగా మానేయడం ఖాయం. సొరకాయ కలాకండ్ మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు

సొరకాయ: 1 మధ్యస్థ పరిమాణం
ఫుల్ క్రీమ్ పాలు: 1 లీటరు
మావా: 200 గ్రాములు
చక్కెర: అర కప్పు
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: అర టీస్పూన్
డ్రై ఫ్రూట్స్: 8-10 తరిగిన బాదం, పిస్తా ముక్కలు
కుంకుమపువ్వు: చిటికెడు

Healthy Bottle Gourd Kalakand Recipe in Telugu You Won t Stop Eating It

తయారీ విధానం

-మొదటగా సొరకాయను శుభ్రంగా కడిగి, తొక్క తీసి సన్నగా తురమాలి. గట్టి గింజలు ఉంటే తొలగించాలి. ఇప్పుడు తురిమిన సొరకాయలోని నీరంతా పోయేలా చేతులతో గట్టిగా పిండాలి.

-బాండీలో నెయ్యి వేడి చేసి, తురిమిన సొరకాయను వేయాలి. మీడియం మంటపై 5-7 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.

-తర్వాత పాలు పోసి, మీడియం మంటపై నిరంతరం కలుపుతూ ఉడికించాలి. సొరకాయ మెత్తబడి, పాలు బాగా చిక్కబడే వరకు ఉంచాలి.

ఐరన్, ప్రోటీన్ నిండిన బలవర్థకమైన వేరుశెనగ చిక్కీ..చలికాలంలో బెస్ట్ హెల్తీ స్నాక్..ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్!

-మిశ్రమం చిక్కబడ్డాక పంచదార, మావా, కుంకుమపువ్వు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. మిశ్రమం గట్టిపడే వరకు తిప్పుతూ ఉండాలి.

-వెడల్పాటి పళ్ళెం లేదా ట్రేకి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా పరచాలి. పైన తరిగిన బాదం, పిస్తా ముక్కలను చల్లి మెల్లగా నొక్కాలి.

-గది ఉష్ణోగ్రత దగ్గర చల్లారిన తర్వాత 2-3 గంటలు ఫ్రిజ్‌ లో ఉంచాలి. ఆపై చతురస్రాకార ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.

[ of 5 - Users]
Story first published: Thursday, November 12, 2026, 13:59 [IST]
Desktop Bottom Promotion